ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పటం, రాజకీయ పార్టీలకు బాగా అలవాటు. ఈ విషయంలో నాలుగు ఆకులు ఎక్కువే చదివింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా వాళ్ళకు ఉన్న బ్లూ మీడియా కానీ, పేటీయం బ్యాచ్ కానీ చేసే తప్పుడు ప్రచారం, హడావిడి గురించి వేరే చెప్పనవసరం లేదు. ఒక పక్క అనుభవ లేమి, మరో పక్క అప్పులు, మరో పక్క ఆదాయం లేకపోవటం, ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి చేయాలో తోచక , చిత్ర విచిత్రమైన పనులు చేస్తుంటే, జగన్ మోహన్ రెడ్డిని నమ్మి, అసెంబ్లీలో ఛాలెంజ్లు చేసిన మంత్రి అనిల్ కుమార్ , ఇప్పుడు అడ్డంగా ఇరుకున్నారు. సెప్టెంబర్ 2019లో, అసెంబ్లీ వేదికగా చాలెంజ్ చేసిన అనిల్ కుమార్ యాదవ్, చూసుకోండి నా తడాఖా, డిసెంబర్ 2021 కల్లా పోలవరం పూర్తి చేస్తాం, చంద్రబాబుకి కొత్త బట్టలు పెడతాం, చంద్రబాబు ఏ బట్టలు కావాలంటే ఆ బట్టలు పెడతాం అంటూ చేసిన హడావిడి, ఇప్పుడు ఆయన మెడకే చుట్టుకుంది. ప్రస్తుతం డిసెంబర్ నెల వచ్చింది. అనిల్ కుమార్ యాదవ్ చెప్పిన డిసెంబర్ 2021 డెడ్లైన్ వచ్చింది. డిసెంబర్ 2021 నాటికి పోలవరం పూర్తి చేస్తాను, మా జగన్ మోహన్ రెడ్డి పూర్తి చేసి చూపిస్తారు, కాచుకోండి అంటూ, తన సహజ శైలిలో రెచ్చిపోయిన అనిల్ కుమార్ యాదవ్ పైన, సోషల్ మీడియాలో నిన్నటి నుంచి ట్రోల్స్ మొదలయ్యాయి.

anilkumar 01122021 2

రేపే పోలవరం ప్రారంభోత్సవం, ముఖ్య అతిధిగా అనిల్ కుమార్ వస్తున్నారు అంటూ, సోషల్ మీడియాలో పోస్ట్ లు పడుతున్నాయి. పోలవర పూర్తయ్యింది, కొత్త బట్టకు వేసుకుని రండి, భోజనాలు పెడుతున్నారు, అనిల్ కుమార్ నీళ్ళు వదులుతాడు, వెళ్లి చూసి వద్దాం అంటూ అనిల్ కుమార్ ని ట్యాగ్ చేసి మరీ హేళన చేస్తున్నారు. అయితే వాస్తవంగా చూస్తే పోలవరం ప్రాజెక్ట్ ని నాశనం చేసింది వైసీపీ. చంద్రబాబు అధికారంలో ఉండగా అప్పగించిన పని, మరో 4 నెలలు పని చేసి ఉంటే, ఈ పాటికే గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చేవి. రివర్స్ టెండరింగ్ అంటూ, నవంబర్ వరకు పనులు ఆపేశారు. తరువాత నుంచి, ఇప్పటి వరకు కేవలం 4 శాతం పని అయ్యిందని ఆర్టిఐ రిపోర్ట్ లు చెప్తున్నాయి. ఇక కేంద్రం అయితే, మేము డబ్బులు ఇవ్వం అంటుంది. వీటి పైన కేంద్రంతో, ఏ మాత్రం పోరాటం చేయటం లేదు. కనీసం అడగను కూడా అడగటం లేదు. ఇలాగే కొనసాగితే, పోలవరం అసలు పూర్తి కూడా అవ్వదు. ఒకటి కేంద్రంతో పోరాడటం, లేదా రాష్ట్రమే భరించటం. ఇవేమీ చేయకుండా, జబ్బలు చరిస్తే, పోలవరం ఎప్పటికీ పూర్తి కాదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read