ఆంధ్రప్రదేశ్ బీజేపీని ప్రక్షాళన చేసే చర్యలు చేపట్టింది, హైకమాండ్. ముఖ్యంగా అమిత్ షా తిరుపతి పర్యటన తరువాత, హైకమాండ్ కు ఇక్కడ విషయాలు మొత్తం అర్ధం అయ్యాయి. ఏపి బీజేపీలో కొంత మంది ముఖ్యులుగా చెప్పుకుంటూ వాళ్ళు చేస్తున్న పనులు బీజేపీకి లాభం కంటే, వైసీపీకి లాభం చేసే విధంగా ఉన్నాయనే అభిప్రాయానికి అధిష్టానం వచ్చింది. దీంతో ఇప్పుడు కోర్ కమిటీ పేరుతో చెక్ పెటింది. ఇన్నాళ్ళు కేవలం సోము వీర్రాజు ఏది చెప్తే అదే ఫైనల్ అయ్యేది. ముఖ్యంగా సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్, సునీల్ దియోధర్, వీరి నలుగురి కనుసన్నల్లోనే పార్టీ నడిచేది. అయితే వీరి పైన సొంత పార్టీలోనే కొంత అసంతృప్తి ఉంది. వీరు వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉంటారనే సందేశం వ్యక్తం అవుతూ వచ్చింది. వైసిపీని ఏమి అనకుండా, టిడిపి పైన విమర్శలు చేయటం, ఇలాంటివి చేస్తూ, ఈ అభిప్రాయాన్ని మరింత బలపడేలా చేసారు. ఇక పొత్తుల విషయంలో కూడా మాట్లాడటం మొదలు పెట్టారు. మరీ ముఖ్యంగా ఒక సెక్షన్ అఫ్ మీడియాని దూరం పెట్టటం, కొంత మందిని సస్పెండ్ చేయటం, పురందేశ్వరి లాంటి వారిని దూరం పెట్టటం, రాజ్యసభ సభ్యులైనా సుజనా, సియం రమేష్ కు ప్రాముఖ్యత ఇవ్వక పోవటం, ఇలా అనేక తప్పిదాలు చేస్తూ వచ్చారు.

vishnu 30112021 2

అలాగే మిత్ర పక్షం జనసేన కూడా వీరి పైన ఆగ్రహంగా ఉందని, పలు సందర్భాల్లో వార్తలు కూడా వచ్చాయి. వీటి అన్నిటి నేపధ్యంలో తిరుపతి వచ్చిన అమిత్ షా, మొత్తానికి క్లాస్ పీకారు. మరీ ముఖ్యంగా అమరావతి ఉద్యమానికి మద్దతు ఇవ్వకపోవటం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో మొత్తం దెబ్బకు లైన్ లో పడ్డారు. పార్టీలోకి వచ్చిన వారికి ప్రాముఖ్యత ఇవ్వాలని కోరారు. అంతే కాదు, ఢిల్లీ వెళ్లి ఆక్షన్ మొదలు పెట్టారు. నిన్న ఏపి బీజేపీ కోర్ కమిటీ ప్రకటించారు. ఇందులో విష్ణు వర్ధన్ రెడ్డికి చోటు ఇవ్వలేదు. కన్నా లక్ష్మీనారాయణ, సియం రమేష్, సుజనా, పురందేశ్వరి లాంటి వారికి కూడా అవకాసం ఇచ్చారు. ఇక నుంచి ఏపి బీజేపీ ఏ నిర్ణయం తెసుకున్నా సోము వీర్రాజు ఒక్కరే తీసుకోవటానికి వీలు లేదు. కోర్ కమిటీ మొత్తం చర్చించి, నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి ఒక్కరితో సంప్రదించే ఇక నుంచి బీజేపీ ముందుకు వెళ్తుంది. పూర్తి ప్రక్షాళన దిశగా కూడా అధిష్టానం ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఒక రకంగా, వైసీపీ అనుకూలంగా సాగుతున్న కొంత మంది బీజేపీ నేతలకు ఇబ్బందే మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read