ప్రజా ప్రతినిధుల కేసులు ఉపసంహరణకు సంబంధించి, ఈ రోజు రాష్ట్ర హైకోర్టులో విచారణ ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు, ఈ కేసులు విచారణను సుమోటోగా స్వీకరించి, విచారణ చేస్తుంది. ముఖ్యంగా జగ్గయ్య పేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజిని, జక్కంపూడి రాజా, మేక వెంకట ప్రతాప్ అప్పారావు, మల్లాది విష్ణు, ఎంపీ మిదున్ రెడ్డి, వైవీ సుబ్బా రెడ్డి. ఇలా వీరి అందరి మీద, క్రిమినల్ కేసుల ఉపసంహరణకు సంబంధించి, హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. సుప్రీం కోర్టు తీర్పు మేరకు ప్రజా ప్రతినిధుల కేసుల ఉపసంహారణ మీద హైకోర్టు విచారణ చేపట్టింది, గతంలో కూడా సుప్రీం కోర్టు ఈ కేసులు ఉపసంహరణకు సంబంధించి, ఇచ్చిన మార్గదర్శక సూత్రాలను, ఈ సందర్భంగా హైకోర్టు ప్రస్తావించింది. కేసులు ఉపసంహరణకు సంబంధించి, జీవో విడుదల చేసిన హోం శాఖ ప్రినిసిపల్ సెక్రటరీ, సమగ్ర నివేదికను హైకోర్టుకు సమర్పించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ప్రజా ప్రతినిధులకు సంబందించి, ఎన్ని కేసులు ఉపసంహరణ కోసం ప్రతిపాదనలు వచ్చాయో, రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. అదే విధంగా విజయవాడలో ప్రజా ప్రతినిధుల కోర్టులో విచారణ జరుపుతున్న ప్రత్యేక కోర్టుకు ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అయితే గతంలో జగ్గయ్య పేట ఎమెల్యే సామినేని ఉదయ భానుకు సంబందించి, ఆయన పైన ఉన్న పది కేసులు ఉపసంహరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో పై, హైకోర్టులో, అనేక మంది పిటీషన్లు దాఖలు చేసారు. ఈ పిటీషన్ల పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటీషన్ల తరుపున హైకోర్టు న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు కూడా వినిపించారు. ఈ నేపధ్యంలోనే ఈ రోజు మొత్తం ఈ కేసులు ఉపసంహారణకు సంబంధించి, సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా అటు రాష్ట్ర ప్రభుత్వ హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటుగా, విజయవాడలో ఉన్న ప్రజా ప్రతినిధుల కోర్టు నుంచి కూడా సంపూర్ణ నివేదిక కావాలని, ఎవరు ఎవరు ఈ సిఫార్సులు చేసారో చెప్పాలని ఆదేశించింది. ఈ కేసు విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. ఈ లోపు తమకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అయితే కేసులు కొట్టేస్తూ, ఇష్టం వచ్చినట్టు నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ఇది షాక్ అనే చెప్పాలి. చూద్దాం ఏమి జరుగుతుందో.