అమరావతి ఏకైక రాజధాని ధ్యేయంగా, అమరావతి రైతులు న్యాయస్థానం టు దేవస్థానం అంటూ, పాదయాత్ర చేస్తూ అమరావతి నుంచి తిరుమల వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గుంటూరు, ప్రకాశం జిల్లాలు దాటి, అమరావతి రైతుల పాదయత్ర నెల్లూరు జిల్లా వరకు చేరుకుంది. తుఫానులో కూడా రైతుల పాదయాత్ర సాగుతుంది. రైతుల పాదయాత్రకు అనూహ్య మద్దతు ప్రజల నుంచి వస్తుంది. నెల్లూరు లాంటి చోట అమరావతికి మద్దతు ఉండదు అని అందరూ అనుకున్నారు. అయితే ఇక్కడ కూడా ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం కూడా మూడు రాజధానుల బిల్లుని వెనక్కు తీసుకుంది. మళ్ళీ పెడతాం అని చెప్తున్నా, ఏమి జరుగుతుందో చూడాలి. ఇక నెల్లూరులో ప్రజల నుంచే కాదు, వైసీపీ నేతల నుంచి కూడా మద్దతు లభిస్తుంది. తమ ప్రభుత్వం పై వ్యతిరేకత తమ మీదకు రాకుండా కొంత మంది నేతలు జాగ్రత్త పడుతున్నారు. తాజాగా నెల్లూరులో పాదయాత్ర చేస్తూ, నిన్న రాత్రి అమరావతి రైతులు బస చేసిన శిబిరానికి వచ్చి, వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మద్దతు పలికారు. రైతులకు సంఘీభావం తెలిపారు. మీకు ఏ అవసరం వచ్చినా చెప్పాలని కోరారు. అయితే అమరావతి రైతులు జై అమరావతి అనే నినాదం చేయాలన కోరగా, కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, వద్దని వారించారు. ఏది ఏమైనా, ప్రభుత్వం మీద వ్యతిరేకత తమ మీద పడకుండా, కొంత మంది ఎమ్మెల్యేలు జాగ్రత్త పడుతున్నారు.
అమరావతి రైతుల శిబిరంలో వైసీపీ ఎమ్మెల్యే.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ వైసీపీ శ్రేణులు...
Advertisements