ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలన విషయాలు బయట పడ్డాయి. సిబిఐ రంగంలోకి దిగటంతో అసలు గుట్టు బయట పడింది. రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందనం రాకెట్ వెనుక ఉన్న అధికారులను పోలీసులు పట్టుకున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌లో ఏకంగా కస్టమ్స్ అధికారులు దొరికారు. ఒక ముఠాతో కలిసి కస్టమ్స్ అధికారులు, ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్నట్టు సిబిఐ అధికారులు గుర్తించారు. దీంతో పట్టుకున్న కస్టమ్స్ అధికారులపై సీబీఐ కేసులు నమోదు చేసింది. మొత్తం ముగ్గురు కస్టమ్స్ అధికారులను పట్టుకున్నారు. అలాగే స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేసి, ఎఫ్ఐఆర్ కూడా ఓపెన్ చేసారు. ఎర్రచందనం దుంగలను చూపించి, అవి పైపులంటూ స్మగ్లింగ్ చేస్తున్నారు. ఏకంగా కస్టమ్స్ శాఖలో సూపరింటెండెంట్‌లుగా చేస్తున్న వెంకటేష్, అనంత పద్మనాభారావులను సిబిఐ అధికారులు పట్టుకున్నారు. రాయలసీమ ప్రాంతం నుంచి ఈ స్మగ్లింగ్ జరుగుతున్నట్టు గుర్తించారు. అయితే దీని వెనుక ఉన్న రాజకీయ నాయకులు ఎవరు అనేది కూడా కూపీ లాగుతున్నారు. ఈ తీగ లాగితే పెద్ద తలకాయలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read