ఇప్పుడు విజయవాడలో రాజకీయం అంతా టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా చుట్టూనే తిరుగుతుంది. తనను హ-త్య చేసేందుకు కుట్ర జరుగుతుందని, తన ఇంటి చుట్టూ రెక్కీ నిర్వహించారని రాధా ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ తరువాత వైసిపి ప్రభుత్వం దీనికి స్పందిస్తూ రాధాకు 2+2 భద్రత ఇస్తామని ప్రకటించి, ఆ తరువాత నామ మాత్రంగా ఒక్క గన్ మెన్ ఆఫీస్ కు పంపగా, రాధా తనకు ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేద,ని తన అభిమానులే తనని కాపాడతారని వాళ్ళని తిప్పిన సంగతి తెలిసిందే. ఆ తరువాత తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా రంగా ఇంటికి వెళ్లి పరామర్శించటంతో, బెజావాడలో రాజకీయం మరింత వేడిక్కింది. వెంటనే ఈ కేసుపై విచారణ జరపాలని టిడిపి నేతలు ఒత్తిడి పెంచారు. అయితే తాజాగా విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ కాంతిరాణ టాటా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ కేసు గురించి, మాట్లాడుతూ తమకు రాధా హ-త్య కు రెక్కి జరిగినట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదనిఅన్నారు. అయినా ఈ కేసుపై ఇంకా క్షున్నంగా పరిశీలన జరుపుతామని, సీసీటీవీ ఫుటేజీని కూడా గమనిస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి అయితే తమకు ఎటువంటి ఆధారాలు దొరకలేదని సీపీ స్పష్టం చేసారు.

police 222022 1

రాధాతో మాట్లాడామని,అ ఆయన ఇచ్చిన సమాచారం కూడా తీసుకున్నామని అన్నారు. దీని పై మరింత సమాచారం తెప్పించుకుంటామని అన్నారు. అలాగే మొన్న చంద్రబాబు, రాధా ఇంటికి వెళ్ళిన సందర్భంలో చేసిన వ్యఖ్యల పైన కూడా పోలీస్ కమీషనర్ స్పందించారు. అసలు అక్కడ ఎలాంటి నేరం జరగలేదని, ఎలాంటి క్రిమినల్ ఆక్టివిటీ తమకు కనిపించలేదని, అలాంటప్పుడు చంద్రబాబు గారు కోరుతున్నట్టు, తాము జీరో ఎఫ్ ఐఆర్ ఎలా నమోదు చేస్తాం అంటూ, చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు, పోలీస్ కమీషనర్. బాధ్యతగా అందరూ ఉండాలని అన్నారు. రాష్ట్ర స్థాయి పోలీస్ ఏజెన్సీలు కూడా విచారణ జరుపుతున్నాయని అన్నారు. ఈ విషయం పై, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. అలాగే విజయవాడలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని అన్నారు. అయితే పోలీస్ కమీషనర్ వ్యాఖ్యలపై విస్మయం వ్యక్తం అవుతుంది. ఒక పక్క రాధా మొత్తం సమాచారం ఇచ్చినా, పూర్తి ఆధారాలు ఇచ్చినా, ఇప్పటికిప్పుడు, తమకు ఆధారాలు దొరకలేదు అని చెప్పటం విస్మయం కలిగించే అంశం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read