జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన పై ఆసక్తి నెలకొంది. ఈ రోజు జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు.జగన్ కు ప్రధాని నరేంద్ర మోడీతో అపాయింట్మెంట్ ఖరారు విషయం పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వైసిపి నేతలు మాత్రం జగన్ రాష్ట్ర సమస్యలపై ప్రధానికి వినతిపత్రం ఇవ్వనున్నారని, అమిత్ షాతో సహా పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలుస్తారని చెపుతున్నారు. పోలవరం ప్రాజెక్టు, జల వివాదాలపై కుడా చర్చిస్తారని, ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రధానిని కలిసి మాట్లాడతారని, బోర్డులకు సాగునీటి ప్రాజెక్టుల అప్పగింతపై కుడా చర్చించస్తారని, మీడియాతో చెప్పారు. అయితే మూడు రాజధానుల అంశంపై కూడా ప్రధానితో చర్చించే అవకాశం ఉందని , అమరావతి అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై గురించి కూడా ప్రధానితో మాట్లాడతారని తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో అమరావతి పై ప్రభుత్వం కన్ఫ్యుజన్ లో ఉంది. దీనికి తోడు అమిత్ షా, తిరుపతి వచ్చిన సమయంలో, అమరావతికి ఫుల్ మద్దతు అని చెప్పటం, తరువాత ఏపి బీజేపీ నేతలు, అమరావతికి మద్దతుగా మాట్లాడటంతో, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఈ విషయం పైన ప్రధానంగా బీజేపీ నేతల మనసు మార్చేందుకు ఢిల్లీ వెళ్తున్నారని తెలుస్తుంది. మొత్తానికి నెల రోజుల క్రిందట అమిత్ షా పర్యటనతో, జగన్ కు సినిమా అర్ధమైంది. మరి ప్రధాని ఎలా స్పందిస్తారో చూడాలి
జగన్ ఢిల్లీ పర్యటన వెనుక, తిరుపతిలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలే ప్రధాన కారణమా ?
Advertisements