చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో వైసీపీ పార్టీ కి చెందిన ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డికి, జెడ్పీటీసీ గీతా రెడ్డి భర్త కొండిరెడ్డికి మద్య గొడవలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. వైసిపి జెడ్పీటీసీ గీతా రెడ్డి భర్త కొండిరెడ్డి తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డిపై సంచలన వాఖ్యలు చేసారు. ద్వారకానాథరెడ్డి తాలిబన్‌ల కంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారని, మా నియోజకవర్గానికి వచ్చి మా పైనే దా-డు-లకు పాల్పడుతున్నారని ఆయన, ద్వారకానాథరెడ్డిని తీవ్రంగా విమర్శించారు. ఆయన నియోజకవర్గం పుంగనూరు అయితే ఇక్కడకు వచ్చి పెత్తనం చేస్తున్నారని కొండిరెడ్డి ఆరోపించారు. ద్వారకానాథరెడ్డి ఒక హిట్లర్ లాగా ప్రవర్తిస్తున్నారని, తాము పార్టీ కోసమే పని చేసే వాళ్ళమని ద్వారకానాథరెడ్డి లాగా దౌర్జన్యాలు చెయ్యమని కొండిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. అయితే ఇలా విమర్శించిన రెండు రోజులకే పోలీసులు వచ్చి కొండ్రెడ్డిని అరెస్ట్ చేసారు. ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానని 2008 లో 7 గురిని మోసంచేసారని కొండ్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఆయన ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానని మోసం చేసారని, ఎమ్మార్వో ఫోర్జరీ సంతకాలతో మోసం చేసారంటూ ,సెక్షన్ ఐపీసీ 467, 468, 471, 420 సెక్షన్ల కింద కేసు అరెస్ట్ చేసారు. దీంతో మరోసారి వైసిపీ నేతలు అయిన సరే, సొంత పార్టీ అరాచకాలు ప్రశ్నిస్తే, మొన్న గుప్తా లాగే చేస్తాం అనే సంకేతాలు ఇచ్చారు.

kondireddy 02012022 2

అయితే తన భర్త అరెస్ట్ పై పై జెడ్పీటీసీ గీతారెడ్డి మాట్లాడుతూ కొండి రెడ్డి ని రాత్రి పుట వచ్చి అరెస్ట్ చేసారని, ఆయనను జడ్జి ఎదుట రాత్రి పూటే హాజరు పరచి, వెంటనే మదనపల్లె సబ్‌జైలుకు పంపించినట్లు ఆమె తెలిపారు. జైలులో తనభర్త అయిన కొండి రెడ్డికి ప్రాణహాని ఉందని ఆమె ఆవేదన చెందుతున్నారు. ఆయనకు ఏ హాని జరిగినా ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, పోలిసులే భాద్యత వహించాలని చెప్పారు. తాము పార్టీ మొదలుపెట్టినప్పటి' నుంచి వైసిపి లోనే ఉన్నామని , వైసిపి ప్రభుత్వం తమకు ఈ సమయమ లో అండగా నిలబడాలని కోరుకుంటున్నామని ఆమె స్పష్టం చేసారు. మానవ హక్కుల కమిషన్‌ను కలిసిదీని పై మాట్లాడతానని కూడా ఆమె చెప్పారు. ఎవరైనా కొండి రెడ్డి కి బెయిలు ఇప్పిస్తే వారిని కూడా చంపేస్తామని ద్వారకానాథరెడ్డి వర్గం బయపెడుతున్నారని చెప్పుకొచ్చారు. మొత్తం మీద, ప్రతిపక్ష పార్టీ నేతలనే కాదు, తమ జోలికి వస్తే ఎవరినీ కూడా వదిలిపెట్టం అనే వార్నింగ్, గట్టిగా ఇస్తున్నారు వైసిపీ నేతలు..

Advertisements

Advertisements

Latest Articles

Most Read