ఈ రోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకులు తరువాత, చంద్రబాబు కొద్ది సేపు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు అనేక విషయాలు ప్రస్తావనకు తెచ్చారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంచనా వేయలేనంత ఇదిగా తయారు అయ్యిందని అన్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రిలను చూసాం కానీ, ఇలా ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసిన వారు ఎవరూ లేరని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్ధిక విధ్వంసం జరుగుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని, ఈ దుర్మార్గులు నాశనం చేస్తున్నారని అన్నారు. వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా, పారిశ్రామిక వేత్తల నుంచి కూలీల వరకు పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లి బ్రతికే పరిస్థితికి తెచ్చారని అన్నారు. గతంలో ఒరిస్సా లోని భువనేశ్వర్ నుంచి, విశాఖకు కూలీలు వలస వచ్చే వారని, ఇప్పుడు రివర్స్ లో మన వాళ్ళే ఉపాధి కోసం భువనేశ్వర్ వెళ్ళాల్సిన పరిస్థితి దాపురించిందని అన్నారు. వీళ్ళకు తెలిసిందల్లా వ్యవస్థలను అడ్డు పెట్టుకుని బెదిరించటం అని, ఏసిబీ , సిఐడి లను అడ్డు పెట్టుకుని, ఎదురు తిరిగిన ప్రతి ఒక్కరినీ బెదిరిస్తున్నారని చంద్రబాబు అన్నారు. చాలా మంది ఈ ప్రభుత్వం పై వ్యతిరేకత ఉన్నా, గౌరవానికి భంగం కలిగిస్తారని సైలెంట్ గా ఉంటున్నారని అన్నారు.
మరి కొంత మంది, ఈ ఉన్మాదులతో మనకెందుకు అని, గొడవలెందుకని ఇంకొందరు పట్టించుకోవటం లేదని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ అరాచకాలను ప్రజలు భరిస్తారని, ఎన్నికల్లో వాళ్ళ సంగతి తేలుస్తారని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావించారు. ముందస్తు ఎన్నికల గురించి ప్రచారం జరుగుతుందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. తెలంగాణాతో పాటు ఎన్నికలకు వెళ్తారని తెలుస్తుందని చంద్రబాబు అన్నారు. ఇక పొత్తుల విషయం పై తాను ఏమి స్పందించను అని చంద్రబాబు అన్నారు. నాయకులు పని చేయాల్సిన అవసరం ఉందని, పార్టీకి భారం అయితే, ఎవరినీ ఉపేక్షించేది లేదని అన్నారు. పని చేయని వారిని పక్కన పెట్టేస్తాం అని చంద్రబాబు అన్నారు. ఎవరు పని చేయకపోయినా మారి పోతారని చంద్రబాబు హెచ్చరించారు. జగన్ కు ఇచ్చిన ఒక్క చాన్స్ అయిపోయిందని, ప్రజలకు మొత్తం క్లారిటీ వచ్చిందని చంద్రబాబు అన్నారు.