ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా ఆర్ధిక క్రమశిక్షణ లోపించిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలియ చేసారు. ఇన్న రాజ్యసభలో, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో అసలు ఆదాయం ఎంత వస్తుంది, ఖర్చు ఎంత చేస్తున్నారు అనే దానికి పొంతన లేకుండా ఉందని, ఆదాయం తక్కువగా ఉందని, ఖర్చు ఎక్కువగా ఉందని, దీని వల్ల, అనుకున్న దాని కంటే కూడా రెవిన్యూ లోటు ఎక్కువగా వస్తుందని అన్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఉచిత పధకాలు అయిన, అమ్మ ఒడి, తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ వీటి వల్ల కూడా, అనుకున్న దాని కంటే కూడా, ఎక్కువ రెవిన్యూ లోటు వస్తుందని అన్నారు. ఈ రెండు పధకాలకు సంబంధించి రెవిన్యూ లోటు సుమారుగా 1779 కోట్ల రూపాయలు ఉందని, రాష్ట్ర ప్రభుత్వం గత బడ్జెట్ లో అంచనా వేసిందని, అయితే దాని కంటే కూడా అధికంగా రెవిన్యూ లోటు వస్తుందని అన్నారు. 14వ ఫైనాన్సు కమిషన్, 15వ ఫైనాన్సు కమిషన్ అంచనా వేసిన దాని కంటే కూడా, ఈ రెవిన్యూ లోటు చాలా ఎక్కువగా ఉందని, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రెవిన్యూ లోటు ఏడాదికి ఏడాదికి పెరుగుతూ వస్తుందని, ఇది చాలా భయంకరమైన ప్రమాదం అని ఆర్ధిక మంత్రి తెలిపారు.

nirmala 15122021 2

నిజానికి రాష్ట్ర విభజన కారణంగా, రాష్ట్రానికి ఏర్పడే రెవిన్యూ లోటుని పుడ్చటానికి, 14వ ఫైనాన్సు కమిషన్, 15వ ఫైనాన్సు కమిషన్ కానీ, కొన్ని అదనంగా రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు నిధులు కేటాయించాయని, అయితే వాటికి మించి కూడా రాష్ట్ర ప్రభుత్వం రెవిన్యూ లోటు వచ్చేలా చేసిందని అన్నారు. ఏపిలో రెవిన్యూ లోటు రావటానికి కారణం, ఆదాయం, వ్యయాలను సరిగ్గా అంచనా వేయకపోవటమే కారణం అని అన్నారు. అలాగే అర్దిక క్రమశిక్షణ కూడా రాష్ట్రానికి లేకపోవటం, ఈ పరిస్థితి ప్రధాన కారణం అని అన్నారు. కాగ్ కూడా ఇదే విషయం స్పష్టం చేసిందని, ఆర్థిక క్రమశిక్షణ లోపంతో లోటు పెరిగిందని కాగ్ చెప్పిందని, రాజ్యసభలో నిర్మలా సీతారామన్ తెలియ చేసారు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా, ఏపి ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉందని, మమ్మల్ని మీరే ఆదుకోవాలి అంటూ, కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలు అన్నీ చూస్తుంటే, రాష్ట్రంలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్ధం అవుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read