ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, జగన్ మోహన్ రెడ్డికి ఏమైనా ఇబ్బంది వచ్చింది అంటే చాలు, ఎవరో ఒకరు ఏదో ఒక మూల నుంచి వచ్చి, స్న్చలన్ వ్యాఖ్యలు చేసి, టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇది యాద్రుచికమో, లేక ఎవరైనా నడిపిస్తారో కానీ, మొత్తానికి ఇలాంటి సంఘటనలు గతంలో అనేకం జరిగాయి. ఇప్పుడు తాజాగా జస్టిస్ చంద్రు అనే తమిళనాడుకు చెందిన జడ్జి ఒకరు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దేశ వ్యాప్తంగా జైభీమ్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. అయితే జై భీమ్ సినిమాలో, సూర్య చేసిన క్యారక్టర్, జస్టిస్ చంద్రు అనే వ్యక్తిది. ఆయన దళితుల కోసం పోరాటం చేస్తారు అనే పేరు ఉందట, ఈ సినిమా తీయటం అది సూపర్ హిట్ అవ్వటం, ఇవన్నీ అందరికీ తెలిసిందే. అయితే ఈ జస్టిస్ చంద్రు అనే ఆయన, ఉన్నట్టు ఉండి, ఆంధ్రప్రదేశ్ వచ్చారు. జైభీమ్ సినిమా సదస్సు అని ఒకటి మొదలు పెట్టారు. అందులో రాష్ట్రంలో దళితులకు జరుగుతున్న అన్యాయాలు గురించి మాట్లాడతారు అనుకుంటే, ఆయన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోర్టులు ఇబ్బంది పెడుతున్నాయి అంటూ, ట్యూన్ అందుకున్నారు. దీంతో అందరూ ఆశ్చర్య పోయారు. ఈయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడిస్తున్నారు అనే చర్చ మొదలైంది.
జస్టిస్ చంద్రు వ్యాఖ్యల పై దళిత సంఘాలు, ఇతర పార్టీ నేతలు స్పందించారు. రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితి గురించి తెలుసుకోవాలని అన్నారు. అలాగే నిన్న హైకోర్టు కూడా స్పందించింది. జస్టిస్ చంద్రు వ్యాఖ్యల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఈ రోజు ఉదయం విలేఖరులతో మాట్లాడుతూ, జస్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్యల పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. జస్టిస్ చంద్రు గురించి పరోక్షంగా మాట్లాడుతూ, ఒక జడ్జి ఎక్కడ నుంచో వచ్చాడు, ఇక్కడ జరుగుతున్న విషయాల పై కాకుండా, ఏవో చెప్పాడు, రాష్ట్రంలో ఏమి జరుగుతుందో, ఇక్కడ జరుగుతున్నవి వీరికి పట్టవా అని ప్రశ్నించారు. ఏపిలో పేటీయం బ్యాచ్ లు తగులుకున్నారని, ఏపిలో జరుగుతున్నవి వీరికి కనిపించవ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఒక నేరస్తుడికి ఇలాంటి వాళ్ళు సుపోర్ట్ చేయటం ఘోరం అని అన్నారు. వీళ్ళకు రిటైర్డ్ అయిన తరువాత పదవులు కావాలని, అందుకే ఇలాంటి చేష్టలకు దిగుతున్నారని అన్నారు. అలాగే ఇక్కడ ఒకాయన, సుప్రీం కోర్టు జడ్జిగా పని చేసి, కొడుకుకి పదవి ఇప్పించుకుని జగన ని పొగుడుతున్నాడని అన్నారు.