జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, మరో సారి హైకోర్టులో మొట్టికాయలు పడ్డాయి. సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 35ను కొద్ది సేపటి క్రితం రాష్ట్ర హైకోర్టు సస్పెండ్ చేసింది. పాత విధానంలో సినిమా టికెట్ రేట్లను నిర్ణయం తీసుకునేందుకు, పిటీషనర్లకు వెసులుబాటు ఇచ్చింది. సినిమా టికెట్ రెట్లను తగ్గిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోని సవాల్ చేస్తూ, ధియేటర్ ల యాజమాన్యాలు, హైకోర్టులో పిటీషన్లు వేసాయి. ఈ పిటీషన్ పైన, ఈ రోజు హైకోర్టులో వాడీ వేడీ వాదనలు జరిగాయి. సుప్రీం కోర్ట్ సీనియర్ న్యాయవాది, ఆదినారాయణరావు, ఆడే విధంగా హైకోర్టు సీనియర్ న్యాయవాది దుర్గా ప్రసాద్ పిటీషనర్ల తరుపున వాదనలు వినిపించారు. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ప్రభుత్వం జీవో జారీ చేసిందని హైకోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు. హైకోర్టు టికెట్ రేట్లకు సంబంధించి, కొన్ని మార్గదర్శక సూత్రాలు విడుదల చేసిందని, దానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 35 ను విడుదల చేసిందని సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు రాష్ట్ర హైకోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు. ఏ విధంగా ఈ జీవోలో తప్పులు ఉన్నాయి, అదే విధంగా హైకోర్టు మార్గదర్శక సూత్రాలు ఏ విధంగా ప్రభుత్వం ఉల్లంఘించింది అనేది కూడా ఆయన హైకోర్టుకు వివరించారు.

hc cinema 14122021 2

ఈ నేపధ్యంలోనే హైకోర్టు ప్రభుత్వం వైపు నుంచి కూడా వాదనలు విన్న అనంతరం, జీవోని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే సినిమా టికెట్ రేట్లు తగ్గింపు పై కోర్టు ఆదేశాలు ఉన్నాయని కూడా, న్యాయవాదులు తీసుకుని వచ్చారు. కొత్త సినిమాల విడుదల సమయంలో రేట్లు పెంచుకునే హక్కు ధియేటర్లకు ఉంటుందని వాదించారు. సినిమా టికెట్ ధరలు తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని, అయితే రీజనబుల్ రేట్స్ ఉండాలి అనేది తమ వాదన అని అన్నారు. ఈ వాదనలతో రాష్ట్ర హైకోర్టు ఏకీభవించింది. ముఖ్యంగా బీ, సి సెంటర్ల లో, నేల టికెట్లను మరీ 5 రూపాయలకు తగ్గించటం అనేది, సహేతుకం కాదు, సమంజసం కాదని, ఇవి ధియేటర్ యాజమాన్యులకు నష్టాలు మిగులుస్తాయని చెప్పి, నిర్వహణ కూడా చేయలేక పోతున్నారని, కూడా ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీంతో హైకోర్టు కూడా ఏకీభవిస్తూ, టికెట్ రేట్లు తగ్గిస్తూ గతంలో ప్రభుత్వం ఏదైతే జీవో ఇచ్చిందో, దాన్ని కోర్టు సస్పెండ్ చేసింది. దీంతో కొత్తగా విడుదల అయిన సినిమాలకు ఊరట అనే చెప్పాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read