యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామరాజు ఏపి ప్రజలకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. రఘురామకృష్ణం రాజు తరుచూ మీడియా ముందుకు వస్తున్నా, ఆయన ఎప్పుడూ ఢిల్లీలోనే ఉంటారు. దానికి కారణాలు కూడా ఆయన అనేక సార్లు చెప్పారు. తాను ఏపిలో అడుగుపెడితే, దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేయటానికి చూస్తున్నారని, తన చుట్టూ ఎస్సీలని పెట్టటం, లేదా ఎస్సీ పోలీసులను పెట్టి, ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టి అరెస్ట్ చేయాలని ప్లాన్ వేస్తున్నారని, అందుకే తాను ఏపిలో అడుగు పెట్టనని చెప్పారు. అయితే ఆయన మొన్నటి వరకు హైదరాబద్ వస్తూ ఉండే వారు. అక్కడ కూడా ఆయనకు నివాసం ఉంది. అయితే మొన్న సిఐడి అధికారులు రాజద్రోహం కేసు అని చెప్పి, అక్కడకు కూడా వెళ్లి అరెస్ట్ చేయటంతో, ఆయన ఇప్పుడు అక్కడ కూడా జాగ్రత్త పడుతున్నారు. ఆయన ఢిల్లీకే పరిమితం అయ్యారు. అయితే రఘురామకృష్ణం రాజు, అమరావతి రైతులకు సంపూర్ణ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రోజు జరిగే పాదయత్ర ముగింపు సభకు రావాలని నిర్ణయించుకున్న రఘురామరాజు, చాలా వ్యూహాత్మికంగా వ్యవహరించారు. నాలుగు రోజులు క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ని కలిసిన రఘురామరాజు, తాను తిరుపతి సభకు వెళ్తున్నానని, ముందుగానే హోంమంత్రికి చెప్పారు.

rrr 17122021 2

అయితే ఈ విషయం మీడియాలో రావటంతో, మళ్ళీ ఏపి పోలీసులు ఏ కేసు అయినా పెట్టి అరెస్ట్ చేస్తారేమో అని, తాను విర్చ్యువల్ గా సభలో పాల్గుంటానని నిన్న మీడియాకు చెప్పారు. మళ్ళీ ఈ రోజు వ్యూహం మార్చి అందరికీ సర్‌ప్రైజ్‌ ఇస్తూ, రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో దిగారు. ఈ రోజు సభలో పాల్గుని, ప్రసంగించనున్నారు. అయితే రఘురామరాజు రాక తెలుసుకుని అమరావతి రైతులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఏపి పోలీసులు అక్రమ కేసులు పెడతారానే అనుమానంతో, రఘురామరాజు ఇంత జాగ్రత్త పడుతున్నారు. మరి ఈ రోజు పోలీసులు ఏమి చేస్తారో చూడాలి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే అమరావతి సభ తిరుపతిలో ప్రారంభం అయ్యింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సహా, అన్ని పార్టీల నేతలు ఈ సభకు వస్తున్నారు. అన్ని పార్టీల నేతలు వేదిక పంచుకోనున్నారు. ఇది ఒక అద్భుతమైన ఘట్టంగా చెప్పవచ్చు. ఇక మరో పక్క పోలీసులు యధావిధగా, సభకు వచ్చే వారిని అడ్డుకుంటున్నారని, ఆరోపణలు వస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read