పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జల్లేరు వాగులోకి ఆర్టీసీ బస్సు దూసుకుని వెళ్ళటంతో,  ఆర్టీసీ బస్సులో ఉన్న పలువురు చనిపోయారు. ప్రమాదంలో డ్రైవర్ సహా 10 మంది వరకు మృతి చెందినట్టు తెలుస్తుంది. ప్రమాద సమయంలో 20 మంది వరకు బస్సులో ఉన్నట్టు చెప్తున్నారు. మరి కొంత మంది గల్లంతు అయ్యారు. ఇప్పటి వరకు మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నట్టు గుర్తించారు. పలువురికి తీవ్రగాయాలు కూడా అయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అశ్వరావుపేట నుంచి జంగారెడ్డిగూడెం వస్తుండగా, ఎదురుగా వచ్చిన వాహనం తప్పించబోయి, వాగులోకి బస్సు దూసుకుని వెళ్ళింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read