లోక్‌సభ వేదికగా, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అధ్వానంగా ఉందని, మిథున్ రెడ్డి వాపోయారు. ఒక విధంగా చెప్పాలి అంటే, ఆయన విలపించటం ఒకటే తక్కువ అని చెప్పాలి. ఈ రోజు లోక్‌సభలో అదనపు పొద్దుల పై జరిగిన చర్చలో, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లడారు. దానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది, దేశ పార్లమెంట్ సాక్షిగా ఆయన చెప్పారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చాలా ఆందోళన కరంగా ఉందని, భరించలేని స్థాయిలో ఆర్ధిక పరిస్థితి ఉందని, ఈ ఆర్ధిక పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బయట పడేయాలి అంటూ, కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే ప్రాదేయ పడ్డారు. విభజన చట్టాలులో ఉన్న అంశాలు అన్నీ పేర్కొంటూ, ఆంధ్రప్రదేశ్ పట్ల సానుభూతి చూపించాలని, ఏపీ పట్ల ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాపాడాలని ఆయన వేడుకున్నారు. విభజన సమయంలో, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, భవిష్యత్తు పై చాలా ఆందోళన చెందుతున్నామని, ఆర్ధికంగా భరించే స్థాయిలో లేమని, దీని నుంచి బయట పడే మార్గం కూడా తమకు కనిపించటం లేదని ఆయన చెప్పారు.
అంతే కాకుండా, ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని, లేకపోతే ఈ ఆర్ధిక పరిస్థితి నుంచి తాము బయట పడటం చాలా కష్టం అవుతుందని అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అన్నీ కూడా, అవి కూడా పదేళ్ళ లో పూర్తి చేయాలనీ ఉందని, ఇప్పటికే ఎనిమిది ఏళ్ళు గడిచి పోయాయని అన్నారు. అయితే ఈ రోజు మిథున్ రెడ్డి పార్లమెంట్ లో మాట్లాడిన మాటలు చూస్తే ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం అవుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులుఎ మీ అయిపోతున్నాయో తెలియదు. ఒక పక్క అప్పులు పుట్టటం లేదు. భూములు అమ్మకానికి పెట్టారు. మద్యం ఆదాయం తాకట్టు పెట్టారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, అన్నీ వాడేస్తున్నారు. అయినా ప్రభుత్వానికి ఏమి తోచటం లేదు. హామీలు అన్నీ అటక ఎక్కాయి. ఇప్పుడు ఉద్యోగుల విషయంలో కత్తి వేలాడుతుంది. అభివృద్ధి ఆగిపోయింది. ఆదాయం లేదు. మెడలు వంచుతాం అని చెప్పిన వాళ్ళు, ఇప్పుడు ఢిల్లీలో బేలగా చూసే పరిస్థితి వచ్చింది. ఎక్కడి వరుకు వెళ్తామో మరి.