మన ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు కంటే, కొంత మంది చేసే ఓవర్ ఆక్షన్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు అంతా ఒక పార్టీకి కొమ్ము కాసే వాళ్ళని, వాళ్ళ వాలకం చూస్తూనే అర్ధం అవుతుంది. వారికి రాష్ట్ర ప్రయోజనాల కంటే, ఒక పార్టీ, ఒక నాయకుడి ప్రయోజనాలే ఎక్కువ. కానీ దానికి ఒక ముసుగు వేస్తారు. అలాంటిదే ఇప్పుడు మేధావుల ఫోరం అని చెప్పుకునే ఒక సంస్థ. ఆ సంస్థ, అమారావతి రైతుల పాదయాత్రను టార్గెట్ చేసింది. చిత్తూరు జిల్లాలో, పాదయాత్ర అడుగు పెట్టిన దగ్గర నుంచి, వీళ్ళ హడావిడి అంతా ఇంతా కాదు. అయితే వీళ్ళు అమరావతి రైతులను కాల్చటానికి, హైకోర్టు మీద తుపాకీ పెట్టారు. అయితే వీళ్ళు ఎక్కడా అధికార పార్టీని ప్రశ్నించరు. వీరి బాగోతం ఈ రోజు మరోసారి బయట పడింది. రాయలసీమలో హైకోర్టు కావాలని వీరు చేసే పోరాటం, కేవలం రాజకీయంగా ఒక పార్టీని కొమ్ముకాయటానికే అనే విషయం అర్ధం అయ్యింది. ఈ రోజు అమరావతి హైకోర్టు ఎదురుగా, మరో హైకోర్టు భవనానికి శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు ఉన్న హైకోర్టుకి చోటు సరిపోక పోవటంతో, ఈ నిర్మాణం చేస్తున్నారు. మరి, ఈ మేధావులు, అక్కడే ఎందుకు హైకోర్టు బిల్డింగ్ కడుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించరు. కర్నూల్ రాజధాని అన్నారు కదా, మరి అక్కడ నిర్మాణాలు ఎందుకు అని అడగలేరు. ఎందుకు అడగలేరో, అర్ధం చేసుకోలెంత అమాయకులు కాదు ప్రజలు. వీరికి నిజంగా సీమలో హైకోర్టు కావాలని ఉంటే, ఈ రోజు జరుగుతున్న శంకుస్థాపన పై నిరసన ఎందుకు తెలపలేదు ?
అమరావతి రైతులని టార్గెట్ చేసే వాళ్ళు, నేడు హైకోర్టులో జరిగిన విషయం పై, జగన్ ని ప్రశ్నించే దమ్ము ఉందా ?
Advertisements