ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఒకటే రాజధానిగా అమరావతి ఉండాలని, భూములు ఇచ్చిన తమను అన్యాయం చేయవద్దు అంటూ, న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర అంటూ, అమరావతి నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేస్తున్న రాజధాని రైతుల పాదయాత్ర 40వ రోజుకి చేరుకుంది. ఈ పాదయాత్ర మరో వారం రోజుల్లో ముగియనుంది. డిసెంబర్ 17న ముగింపు సందర్భంగా, బహిరంగ సభ పెట్టాలని అమరావతి జేఏసి నిర్ణయం తీసుకుంది. దీని కోసం ఇప్పటికే, ఎస్వీ యూనివర్సిటీ గ్రౌండ్ ఇవ్వమని పర్మిషన్ కోరగా, సహజంగా ప్రభుత్వం ఆధీనంలో ఉండే ఎస్వీ యూనివర్సిటీ, ఆ వినతిని తిరస్కరించింది. దీంతో రైతులకు, తమ భూమి ఇస్తాం అని, తన భూమిలో మీటింగ్ పెట్టుకోవాలని, ఒక వ్యక్తి ముందుకు రాగా, రైతులు, ఆ భూమిలో మీటింగ్ పెట్టుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంతకంటే ముందే, పోలీస్ వారికి, అక్కడ మీటింగ్ పెట్టుకోవటానికి అనుమతి కోరారు. దీని పైన గత వారం రోజులుగా చర్చలు నడుస్తున్నాయి. పోలీసుల ప్రశ్నలకు, అమరావతి రైతులు సమాధానాలు కూడా ఇచ్చారు. అయితే అందరూ అనుకున్నట్టే, పోలీసులు, రాజధాని రైతులకు షాక్ ఇచ్చారు. అనుమతిని నిరాకిస్తున్నాం అని, మీటింగ్ పెట్టుకోవటానికి వీలు లేదు అంటూ షాక్ ఇచ్చారు.
దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 17న తిరుపతిలో సభకు పోలీసుల అనుమతి నిరాకరించారని, ముందుగానే లేఖ ఇచ్చినా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేశారని వాపోయారు. శని, ఆదివారాలు కోర్టు సెలవు చూసుకుని నిర్ణయం ప్రకటించారని అన్నారు. తిరుపతిలో సభకు అనుమతి కోరుతూ హైకోర్టును ఆశ్రయిస్తాం అని, సోమవారం హైకోర్టులో పిటీషన్ దాఖలు సెహ్స్తామని అన్నారు. అలాగే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాం అని అన్నారు. ఇక అమరో పక్క ఈ నెల 15, 16న శ్రీవారి దర్శనం కోసం టీటీడీను కోరాం అని, ఆలయ నిబంధనలకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశాం అని, కొండపై రాజకీయ విమర్శలు, జెండాలు, నినాదాలు చేయం అని, పాదయాత్ర చేసినవారికి దర్శన భాగ్యం కల్పించాలని టిటిడిని కోరాం అని, టీటీడీ ఇచ్చిన షరతులపై సమాధానం పంపాం అని అమరావతి రైతులు తెలిపారు. అయితే పోలీసులు మాత్రం, హైకోర్టు కేవలం పాదయాత్రకే అనుమతి ఇచ్చిందని, మీటింగ్ కి పర్మిషన్ ఇవ్వలేదని అంటున్నారు. మరి హైకోర్టు, ఏమి చెప్తుందో చూడాలి.