రాష్ట్ర ఎన్నికల కమిషన్ వైఖరి పైన, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పని చేస్తున్నట్టు కనిపించటం లేదు అంటూ, కీలక వ్యాఖ్యలు చేసింది. రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో, ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించ లేదు. రాజధాని గ్రామాల్లో, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించక పోవటం పైన, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పలు సందేహాలు వ్యక్తం చేసింది. అసలు రాజధాని గ్రామాల్లో ఉన్న ప్రజలు దేని కిందకు వస్తారు అని కోర్టు ప్రశ్నించింది. వారు పురపాలక ప్రాంతానికి చెందిన వారా ? లేక నగర పాలక ప్రాంతానికి చెప్పిన వారా అని ప్రశ్నించింది. ప్రభుత్వం దీని పైన జవాబు ఇవ్వాలని ఆదేశించింది. అక్కడ ఇన్నాళ్ళు ఎన్నికలు నిర్వహించక పోతే, ప్రజలు వాళ్ళ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని ఎలక్షన్ కమిషన్ ను ప్రశ్నించింది. ప్రజా ప్రతినిధులు లేక పొతే, ప్రజలు ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించింది. ఇక రాష్ట్ర ఎన్నికల కమిషన్, కోర్టుకు ఇచ్చిన వివరాలు చుస్తే, అసలు మీరు స్వతంత్రంగా పని చేసే వారేనా అనే అనుమానం కలుగుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికలు నిర్వహించే క్రమంలో మీరు, స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారా, లేదా అనే అనుమానం కలుగుతుందని, ఎలక్షన్ కమిషన్ ని ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది.

hc 11122021 2

ఎన్నికల కమిషన్ ప్రభుత్వాన్ని ఆదేశించాలి కానీ, ప్రభుత్వాన్ని ఎన్నికలకు సహకరించాలని అభ్యర్దించటం వింతగా ఉందని, కోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించి, రాజ్యాంగం లోబడి పని చేయాలని అనుకుంటుందా, లేకపోతే ప్రభుత్వంతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటుందా అంటూ, కోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయం పైన తమకు స్పష్టత ఇవ్వాలని కోర్టు చెప్పింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటికే మూడు రాజధానుల బిల్లుని రద్దు చేసింది కాబట్టి, సీఆర్డీఏ చట్టం మళ్ళీ తిరిగి అమలులోకి వచ్చింది కాబట్టి, అమరావతి ప్రాంతంలో ఎన్నికల నిర్వహణ పైన, తమ అభిప్రాయాలను కోర్టుకు తెలపాలని, హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు పైన విచారణకు వారం రోజులకు వాయిదా వేసింది. రాజధాని పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలి అంటూ, కొంత మంది స్థానికులు హైకోర్టుని ఆశ్రయించిన కేసు విచారణలో భాగంగా, కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read