ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ రోజు, ప్రాధాన న్యాయమూర్తి ధర్మాసనంతో పాటు, మరో ధర్మాసనం జస్టిస్ బట్టు దేవానంద్, ఈ రోజు జస్టిస్ చంద్రు వ్యాఖ్యల పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జస్టిస్ చంద్రు వ్యాఖ్యల పై చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా తీవ్ర అసహనం వ్యక్తం చేయటమే కాకుండా, కొంత మంది జ్యుడిషియల్ సెలబ్రిటీలు లైం లైట్ లోకి ఉండేదుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి వ్యాఖ్యానించటంతో పాటుగా, ఇటువంటి వాటిని ఆపేస్తామని హెచ్చరించారు. మేము మనుషులమే అని, కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయని, హ్యూమన్ రైట్స్ గురించి అడ్డ్రెస్ చేయటానికి వచ్చి, ఆయన దాని గురించి మాట్లాడితే బాగుండేదని కూడా వ్యాఖ్యానించారు. మేము పరిధి దాటి మాట్లాడామని అంటున్నారు, అది సరి కాదని కూడా, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా స్పష్టం చేసారు. ఇక దీంతో పాటు హైకోర్టుని ఉద్దేశించి జస్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్యల పై, ఒక కేసు విచారణ సందర్భంగా, జస్టిస్ బట్టు దేవానంద్ కూడా తీవ్రంగా స్పందించారు. ఎంతో మంది ప్రాధమిక హక్కులను హైకోర్టు కాపాడుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేసారు. జస్టిస్ చంద్రు ఆరోపణలు నిరాధారమైనవి అని, మొత్తం హైకోర్టుని ఆయన ఎలా నిందిస్తారని ప్రశ్నించారు.

chandaru 13122021 2

ఒక డాక్టర్ ని పోలీసులు రోడ్డు పైన విచక్షణా రహితింగా కొట్టారని, హక్కులు గురించి పోరాడాలని అంటే, విశాఖకు వెళ్లి మంచి డైరెక్టర్ తో, ఆ సంఘటన పై మంచి సినిమా తీయించండని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలోని ఇతర హైకోర్టులతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, న్యాయమూర్తి నుంచి కక్షిదారుల వరకు, ఏపి హైకోర్టులో కనీస సౌకర్యాలు కూడా లేవని, ఈ సందర్భంగా జస్టిస్ బట్టు దేవానంద్ వ్యాఖ్యానించారు. కనీస సదుపాయాలు కూడా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని, మర్చిపోవద్దు అని కూడా ఆయన స్పష్టం చేసారు. హైకోర్టు న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తుంటే, సిబిఐ విచారణకు ఆదేశించటం తప్పు ఎలా అవుతుందని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. అలాగే చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కూడా అసహనం వ్యక్తం చేస్తూ, మీరు మాట్లాడిన విషయాలు సరి కాదని స్పష్టం చేసారు. హ్యుమన్‌రైట్స్ డేను మాట్లాడటానికి వచ్చిన ఆయన, మా మీద మాట్లాడటం సరి కాదని, తీవ్ర అసహనం వ్యక్తం చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read