ఈ రోజు లాక్ సభలో, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు, అదే విధంగా వైసీపీ లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి మధ్య వాగ్వాదం నడిచింది. జీరో హావర్ సందర్భంగా , అమరావతి రైతులు చేస్తున్న మహా పాదయాత్ర అయిన, న్యాయస్థానం టు దేవస్థానంకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ పోలీసులు కల్పిస్తున్న అడ్డంకులకు సంబంధించి జీరో హావర్ లో, ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రస్తావించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు పూర్తి స్థాయిలో హైకోర్టు అనుమతి తీసుకున్నా కూడా, మహా పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు కల్పిస్తున్నారని, అక్కడ రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని, ప్రజల ప్రాధమిక హక్కులను కూడా పోలీసులు కాలరాస్తున్నారని సభ దృష్టికి తెసుకుని వచ్చారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని రఘురామకృష్ణం రాజు మహా పాదయాత్ర గురించి ప్రస్తావించారు. అయితే రఘురామకృష్ణం రాజు ప్రసంగంతో, ఒక్కసారిగా వైసీపీ ఎంపీలు ఉలిక్కి పడ్డారు. తమ బండారం మొత్తం రఘరామరాజు బయట పెడుతున్నారని గ్రహించి, ఆయన ప్రసంగానికి అడ్డుకునే ప్రయత్నం చేసారు, వైసీపీ ఎంపీలు. అయితే రఘురామ రాజు మాట్లాడిన తరువాత, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడారు. విషయం పైన , జరుగుతున్న దాని పైన సమాచారం చెప్తారని అందరూ అనుకున్నారు.
పోలీసులు ఎందుకు అలా వ్యవహరించారో చెప్పకుండా, ఒక్కసారిగా రఘురామకృష్ణం రాజు పైన వ్యక్తిగత దా-డికి దిగారు. రఘురామకృష్ణం రాజు తన పైన ఉన్నతు వంటి సిబిఐ కేసులు నుంచి తప్పించుకోవటానికి , ఈ ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకే రఘురామకృష్ణం రాజు బీజేపీలో చేరేందుకు తహతహలాడుతున్నారని, ఆయన పైన రెండు సిబిఐ కేసులు ఉన్నాయని, ఆ సిబిఐ కేసులను వెంటనే విచారణ చేయాలని, దర్యాప్తు వేగవంతం చేయాలని, సంబంధం లేని విషయాలు మాట్లాడారు. అయితే అదే సమయంలో రఘురామ రాజు , నా పైన రెండు కేసులే ఉన్నాయని, మీ నేత పైన వందల కేసులు ఉన్నాయని, ముందు వాటి సంగతి చూసుకోండి, వాటిని కూడా విచారణ చేయమని అడగండి అని కౌంటర్ చేసారు. ఆ తరువాత రఘురామరాజు విలేఖరులతో మాట్లాడుతూ, జరిగిన విషయాన్ని విలేఖరులకు చెప్పారు. అయితే తాను మాట్లాడుతున్న సమయంలో, చెప్పలేని భాషతో బూతులు మాట్లాడారని, ఈ బూతులు చివరకు పార్లమెంట్ కు తెచ్చారని అన్నారు.