పల్నాడు వైసీపీలో విబేధాలు బయట పడ్డాయి. గతంలో పలు సార్లు వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయను వైసీపీ నేతలు అవమానించిన సంఘటనలు ఉన్నాయి. గతంలో తనను అవమానించినా ఎక్కడా కూడా ఎంపీ లావు కృష్ణదేవరాయ బయట పడలేదు. పలు సార్లు కొన్ని అధికారిక కార్యక్రమాలకు కూడా ఆయనకు ఆహ్వానం కూడా రాకుండా అవమానించారు. అయితే ఈ రోజు కూడా నరసరావుపేటలో రెండు కార్యక్రమాలు జరుగుతున్నా, తనని అవమానించటంపై ఎంపీ లావు అగ్రాహం వ్యక్తం చేసారు. ఈ రోజు నరసరావుపేటలో మార్కెట్ యార్డ్ పాలకవర్గం ప్రామాణ స్వీకర కార్యక్రమం ఈ రోజు జరుగుతుంది. ఆ ప్రమాణ స్వీకర కార్యక్రమానికి మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు సహా మిగతా ఎమ్మెల్యేలు కూడా హాజరు అవుతున్నారు. దీంతో పాటు మరో కార్యక్రమం కూడా ఉంది. కొండవీటులో నగరవనంకు చెందిన శంకుస్థాపన, కొండవీటి అభివృద్ధికి చెందిన పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఈ రెండు అధికారిక కార్యక్రమాలకు కూడా ఎంపీ లావు కృష్ణదేవరాయకు ఆహ్వానం లేకుండా, ఆయన్ను తీవ్రంగా అవమానించారు. ఎందుకు ఇలా చేస్తున్నారో అర్ధం కాని పరిస్థితి ఉంది. ఎంపీ లావు కృష్ణదేవరాయను పార్టీలో నుంచి పంపించటానికి, ఇలా చేస్తున్నారా అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.
అయితే ఈ అంశం పైన, స్థానిక నేతలు, స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేల పైన ఎంపీ లావు కృష్ణదేవరాయ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనకు గతంలో కూడా ఇదే విధంగా పలు అవమానకర సంఘటనలు జరిగాయని, అయినా కూడా ఎక్కడ బయట పడలేదని, అయినా కూడా రోజు రోజుకీ ఇటువంటి సంఘటనలు పెచ్చు మీరుతున్న నేపధ్యంలోనే, ఇటువంటి సంఘటనల పైన, ఇప్పటికే హైకమాండ్ కు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఇది దేనికి దారి తీస్తుందో చూడాలి. ఒక్కసారిగా తనలో ఉన్న అసంతృప్తిని లావు కృష్ణదేవరాయ బయట పెడుతున్నారు. అధిష్టానం చెప్పినా కూడా, పట్టించుకోక పోవటం, రోజు రోజుకీ ఈ సంఘటనలు ఎక్కువ అవ్వటంతో, ఎంపీ లావు కృష్ణ దేవరాయ మీడియా సమావేశం ఏర్పాటు చేసారని తెలుస్తుంది. మరి ఈ విలేఖరుల సమావేశంలో, ఈ విబేధాల గురించి ఎలాంటి స్పష్టత ఇస్తారో చూడాలి. ఈ విషయం పైన, అధిష్టానం ఏమి చేస్తుందో మరి. ప్రోటోకాల్ ప్రకారం ఎంపీకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వటానికి, ఇబ్బంది ఏమిటో మరి ?