ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారి శ్రీ విజయానంద్ ఈ రోజు వెలగపూడి సచివాలయంలో అఖిలపార్టీ సమావేశం ఏర్పాటు చేసి ఓటరు లిస్టుపై చర్చించారు. తెలుగుదేశం పార్టీ తరపున ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య చర్చలో పాల్గొని ఈ కింది సూచనలు చేశారు. 1. ఓటరు జాబితా రూపకల్పనలోని లోపాలను సవరించాలని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లిన వర్ల రామయ్య. 2. ఓటర్ల నమోదు ప్రక్రియలో ఉన్న తప్పిదాలు కొనసాగితే ప్రజాస్వామ్యానికే అర్థం ఉండదు. 3. ప్రజాస్వామ్య విలువలకు తీవ్రమైన ముప్పు ఏర్పడుతుంది. 4.ఒకే కుటుంబంలోని సభ్యుల ఓట్లు అనేక బూత్ లలో నమోదైతే ఇంట్లో వాళ్లను చీల్చి బజారుకొకళ్లను పంపిస్తారా.? 5. ఒకే చిరునాతో ఉన్న ఓట్లు వివిధ బూత్‌లలో ఉన్నాయి. 6. ఒకే ఇంట్లో 144 ఓట్లు ఉండే అవకాశం ఉందా.? ఆ ఓట్ల జాబితా ప్రభుత్వం బయటపెట్టాలి.? 7. మరణించిన వ్యక్తుల ఓట్లు ఇప్పటికీ ఓటరు జాబితాలో కొనసాగుతున్నాయి. 8. చనిపోయిన వ్యక్తుల పేర్లను తొలగించాలని స్థానిక ఎన్నికల అధికారులను కోరినప్పుడు ఆ పేర్లను తొలగించడానికి తమకు ఆదేశాలు లేవని సమాధానం వచ్చింది. 9. ఓటర్ల జాబితా మదింపు కోసం ఏర్పాటు చేసిన బూత్ లెవల్ ఏజెంట్ కమిటీలు నిరంతరాయంగా ఉన్నాయా లేదా తాత్కాలికంగా ఉన్నాయా? 10. ఓటర్ కార్డును ఆధార్‌తో లింక్ చేయడంలో బూత్ లెవల్ ఏజెంట్లు తమ స్వామిభక్తి చూపిస్తూ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.
11. వలస వచ్చిన వారి ఓట్లు ఇంకా కొనసాగుతున్నాయి. 12.ఒక వ్యక్తి అనేక నియోజకవర్గాలల్లో ఓటు కలిగి ఉన్నారు. 13.గ్రామ రెవెన్యూ అధికారులు అధికార వైసీపీకి అనుకూలంగా ఉన్నవారి ఓట్లు మాత్రమే చేర్చి ఇతర పార్టీల ఓట్లను తొలగిస్తున్నారు. 14. తటస్థ ఓటర్లను, ఇతర పార్టీలకు చెందిన ఓటర్లను బెదిరించి ఓట్ల నమోదులో జోక్యం చేసుకుంటున్నారు. టీడీపీ అని అనుమానించి జాబితా నుండి తొలగిస్తున్నారు. 15. ఇదే తరహా విధులను అంగన్‌వాడీ వర్కర్లు కూడా నిర్వహిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. వారిని తొలగించాలి. 16.ఆధార్ తో ఒటరు లిస్టు అనుసంధానం చేసిన రీతిలో బయో మెట్రిక్ ను కూడా పోలింగ్ బూత్ వద్ద ఏర్పాటు చేస్తే దొంగఓట్లు పూర్తిగా నిరోధించవచ్చని సూచన. 17. పైన పొందుపరిచిన సమస్యలను పరిశీలించి, ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా దిద్దుబాట్లు చేయాలి. 18. వీటిపై కలెక్టర్లు, ఎన్నికల అధికారులు కిందిస్థాయి అధికారులను ఆదేశించాలని వర్ల రామయ్య రిప్రంజంటేషన్ ఎన్నికల అధికారికి అందించారు.