ఈ మధ్య కాలంలో రాం గోపాల్ వర్మ, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సినీ టికెట్ల విషయం పై టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వంలో అందరినీ టార్గెట్ చేసిన వర్మ, జగన్ మోహన్ రెడ్డిని మాత్రం, ఏమి అనటం లేదు. ముఖ్యంగా మంత్రి పేర్ని నాని, మరో మంత్రి కొడాలి నాని, అలాగే అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళని గట్టిగా టార్గెట్ చేసారు. పేర్ని నానికి డ్రైవర్ కి తేడా ఏంటి అని ప్రశ్నించగా, కొడాలి నాని ఎవరో తెలియదు అని కౌంటర్ ఇచ్చారు. ఇక అనిల్ కుమార్ యాదవ్ ని ఒక సినిమా తీసి 15 రూపాయలకు టికెట్ పెట్టుకోవాలని సూచించారు. అయితే ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న కొడాలి నాని మాట్లాడుతూ, వర్మకి కొడాలి నాని అంటే ఎవరో తెలిసేలా చేస్తానని అన్నారు. అయితే వర్మ ఈ రోజు జగన్ ని ఉద్దేశిస్తూ రెండు ట్వీట్లు పెట్టారు. అయోతే కొద్ది సేపటికే అవి డిలీట్ అయిపోయాయి. ఒకటి పెట్టారు, డిలీట్ చేసారు. మళ్ళీ ఇంకోటి పెట్టారు, మళ్ళీ డిలీట్ చేసారు. ఎందుకు డిలీట్ చేసారో, ఎవరు డిలీట్ చేయమంటే చేసారో ఆయనకే తెలియాలి. జగన్ ని ఉద్దేశిస్తూ, జగన్ నీ చుట్టూ ఉన్న వాళ్ళతో జాగ్రత్త, వాళ్ళు మీడియా ముందుకు వచ్చిన ప్రతి సారి మీ ఇమేజ్ పడిపోతుంది, వైసీపీలో నేను ఇష్టపడే ఒకే ఒక వ్యక్తి మీరు అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసి డిలీట్ చేసారు.
జగన్ పై ట్వీట్ చేసి డెలీట్ చేసిన రామ్ గోపాల్ వర్మ... ఎవరు డిలీట్ చేపించారు ?
Advertisements