తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 సంవత్సరాలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు అధ్యక్షతన బీసీ ముఖ్య నేతల సమీక్షా సమావేశం నిర్వహించారు. బీసీల ఆరాధ్య దైవం కీ.శే. నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలు త్వరలో ప్రారంభం అవుతున్నాయని, ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమాల్లో బీసీలను రాజకీయంగా, సామాజికంగా మరింత ముందుకు తీసుకెళ్లాలా అందరి అభిప్రాయాలు సేకరిస్తాం అని అన్నారు. బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించడం కోసం అధ్యయనం చేయనున్నాం అని, బీసీల ఐక్యతకు, సంక్షేమానికి, అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ 40 ఏళ్లుగా చేసిన కృషి అనిర్వచనీయం అని, బీసీలకు రాజకీయ ఆర్ధిక సామాజిక గుర్తింపు తెలుగుదేశంతోనే సాధ్యమైంది. సాధ్యమవుతుంది అని అన్నారు. ఈ సమావేశంలో శ్రీ అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. బీసీలకు రాజ్యాధికారం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదే. గత 40 సంవత్సరాలుగా బీసీల రాజకీయ, ఆర్ధిక, సామాజిక పురోబివృద్ధికి పార్టీ ఎంతో ప్రోత్సాహం అందించింది. అదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ బీసీలకు ప్రాధాన్యం ఇస్తామని ఇటీవల పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడి ప్రకటనను ఉద్ఘాటించారు. టీడీపీ అంటే బీసీ అనేలా ఎప్పుడూ బీసీలు తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉన్నారు. కానీ.. మొన్నటి ఎన్నికల్లో జగన్ రెడ్డి మోసపూరిత హామీలు, తప్పుడు ప్రచారంతో ఐక్యంగా ఉండే బీసీల మధ్య చిచ్చు పెట్టారు. జగన్ రెడ్డి కుట్రలను, కుతంత్రాలను ఛేదిస్తూ బీసీలు ఐక్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. స్వాతంత్ర్యానంతరం రాజకీయంగా అణగదొక్కబడ్డ బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే అవకాశాలు లభించాయి. స్థానిక సంస్థల్లో 34శాతం రిజర్వేషన్లు కల్పించి వేలాది మందికి రాజకీయంగా అవకాశాలు కల్పించాం. కానీ.. జగన్ రెడ్డి ప్రబుత్వం రిజర్వేషన్లను కుదించి బీసీల రాజకీయ నాయకత్వంపై గొడ్డలివేటు వేసిందని మండిపడ్డారు. భేటీలో పలు తీర్మాణాలు చేశారు. 1. బీసీలకు విదేశీ విద్య, బీసీ భవన్స్, పూలే స్టడీ సర్కిల్స్, కార్పొరేషన్, ఫెడరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు, ఆదరణ పరికరాలు సహా పదుల సంఖ్యలో సంక్షేమ పథకాలు అమలు చేస్తే.. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నిలిపివేసి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం. 2. సలహాదారులు, నామినేటెడ్ పదవులు, ఇతర ఛైర్మన్ల పదవుల కేటాయింపు విషయంలో అర్హత, అనుభవం ఉన్న బీసీలకు కనీస ప్రాధాన్యం కూడా ఇవ్వకుండా, ఒకే సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యమిచ్చి బీసీలను అవమానించడాన్ని తీవ్రంగా ఖండించారు.
ఈ అంశాన్ని ప్రజల్లోకి మరింత ఉదృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. 3. వైసీపీ నేతల అవినీతి, అక్రమాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టిన టీడీపీ నేతలపై కేసులు పెట్టి వేధించడం దుర్మార్గం. బీసీ సంఘాల్లోని నేతలంతా వైసీపీ దుర్మార్గాలపై గళం విప్పాలని నిర్ణయించారు. 4.నిధులు, విధులు లేకుండా కార్పొరేషన్లను ప్రకటించి బీసీ సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలతో కలిసి ఉద్యమించేందుకు కార్యాచరణ. 5. కార్పొరేషన్లు, ఫెడరేషన్ల ద్వారా యువతకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయకుండా దాదాపు రూ.18 వేల కోట్లకు పైగా నిధులు దారి మళ్లించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. తక్షణమే కార్పొరేషన్ల రుణాల కోసం వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని నిర్ణయించారు. 6.ఆదరణ పథకం ద్వారా పనిముట్లు పంపిణీ, సగంలో ఆగిపోయిన బీసీ భవన్స్ పూర్తి చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని భేటీలో నిర్ణయించారు. 7. బీసీ జనగణన చేయాలంటూ తెలుగుదేశం ప్రభుత్వం 2014లోనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. ఇప్పుడు మరోసారి తీర్మానం చేసినట్లు జగన్ రెడ్డి హడావుడి చేసుకుంటున్నారు. కానీ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా ప్రభుత్వంతో పోరాడాలని తీర్మానించారు. సమావేశంలో పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, కిమిడి కళా వెంకట్రావు, కాలవ శ్రీనివాసులు, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బెందాళం అశోక్, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, బచ్చుల అర్చునుడు, బి.టి.నాయుడు, బీదా రవిచంద్రయాదవ్, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కొనకళ్ల నారాయణ, బి.కె.పార్థసారధి, పల్లా శ్రీనివాసరావు, గొల్లా నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు వి.కొండబాబు, జయమంగళ వెంకటరమణ, ఆర్.జితేందర్ గౌడ్, ద్వారపురెడ్డి జగదీశ్, గుండుముల తిప్పేస్వామి, బుద్దా వెంకన్న, బచ్చుల పుల్లయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, కాగిత కృష్ణప్రసాద్, నిమ్మల కిష్టప్ప, పంచుమర్తి అనురాధ, శ్రీరాం చినబాబు, వాసంశెట్టి సత్య, గంజి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.