వైసిపి ఎంపి రఘురామకృష్ణరాజు తన సొంత ప్రభుత్వం పై రోజు బాణాలను సంధిస్తూ, ప్రతి రోజూ చాకిరేవు పెడుతూ, చేస్తూ సొంత్ పార్టీ నేతలకే చెమటలు పట్టిస్తూ ఉంటారు. అలాగే ఈ రోజు మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేసారు. తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని వచ్చిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, పార్టీయే తనపై అనర్హత వేటు వేసే ఆలోచనలో ఉన్నారని, నేనే జగన్ కు టైం ఇస్తున్నా, అనర్హత వేటు వేస్తారా సరే , లేదంటే అప్పుడే నేను ఎంపీ పదవికి రాజీనామా చేస్తా అని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఒకవేళ నేనే రాజీనామా చేస్తే మళ్ళీ ఎన్నికలకు వెళ్లి గెలిచి చూపిస్తా, అప్పుడు ఈ పనికిమాలిన ప్రభుత్వం మీద జనాలకి ఎంత వ్యతిరేఖత ఉందో అర్థం అవుతుంది, వాళ్ళు నా మీద అనర్హత వేటు వేసి నన్ను పార్టీ నుంచి తొలగించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారని, వాళ్ళు నన్ను వదలట్లేదు అని అన్నారు. మన ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన పీడ వదిలించుకునేందుకే నేను ఈ రాజీనామా నిర్ణయం తీసుకున్నానని రఘురామకృష్ణరాజు, సంచలన వ్యఖ్యలు చేసారు. రాజధానిగా తన మద్దతు ఎప్పుడు అమరావతేనని చెప్పుకోచ్చారు. అయితే గత కొన్ని రోజులుగా వస్తున్న రాజీనామా వ్యఖ్యలకు, రఘురామరాజు, ఈ రోజు ఫూల్ స్టాప్ పెట్టారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read