కర్నూల్ జిల్లా ఆత్మకూరులో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చివరకు ఇవి కాల్పుల వరకు వెళ్ళటంతో, ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ నేత బుడ్డా శ్రీకాంత్ రెడ్డిపై దా-డి చేయటంతో, పరిస్థితి చేయి దాటి పోయింది. కర్నూల్ జిల్లాలో  పద్మావతి స్కూల్ దగ్గరలో మసీదు నిర్మాణ విషయంలో, జరిగిన గొడవ కాల్పుల వరకు వెళ్ళింది. శ్రీశైలం నియోజకవర్గానికి బుడ్డా శ్రీకాంత్ రెడ్డి, బీజేపీ ఇంచార్జ్ గా ఉన్నారు. అయితే అక్కడ మసీదు నిర్మాణం జరుగుతూ ఉండటంతో, ఆయన దాన్ని అడ్డుకున్నారు. దీంతో అక్కడ మైనారిటీ వర్గీయులు బీజేపీ నేతను తరిమి కొట్టారు. ముందుగా రాళ్ళ దా-డి చేసి, బుడ్డా శ్రీకాంత్ రెడ్డి కారు ధ్వంసం చేసారు. ఈ దా-డి-లో  బుడ్డా శ్రీకాంత్ రెడ్డికి కూడా గాయాలు అయ్యాయి. పరిస్థితి చేయి దాటి పోవటంతో, బుడ్డా శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు స్టేషన్ కు తీసుకుని వెళ్లి ఆశ్రయం ఇచ్చారు. అయితే పోలీస్ స్టేషన్ ని కూడా ముట్టడించారు. శ్రీకాంత్ రెడ్డిని తరిమి కొట్టటంతో, పోలీసులు చివరకు గాల్లోకి కాల్పులు జరిపారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ ఎదుట బాధితులు నిరసన తెలుపుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read