జగన్ కు విజయసాయిరెడ్డికి మధ్య దూరంరోజు రోజుకి పెరుగుతుంది అంటూ ఈ రోజు మీడియాలో వార్తలు వచ్చాయి. జగన్ ఢిల్లీ పర్యటనలో ఈ దూరం స్పష్టంగా కనిపించిందని ఆ కధనాల సారంశం. ఢిల్లీ పర్యటనలో జగన్ , విజయసాయి రెడ్డికి ఏ మాత్రం ప్రాధాన్యత ఇచ్చినట్లు కనబడలేదు. కనీసం వీరిద్దరూ ముఖాముఖీ ఎక్కడ మాట్లాడుకోలేదు. జగన్, సింధియాతో మీటింగు జరిగిన సందర్భంలో కూడా విజయసాయిరెడ్డిని వద్దని బయటకు పంపివేసినట్లు మీడియాలో కధనాలు వచ్చాయి. కనీసం ఢిల్లీలో ఆ రోజు రాత్రి జరిగిని డిన్నర్ కి కూడా విజయసాయి ని పిలవలేదట. కాని జగన్ సడన్ గా విజయసాయిరెడ్డిని ఎందుకు ఇంత దూరం పెడుతున్నారనేది వైసిపి వర్గాల్లో ఇప్పుడు హట్ టాపిక్ గా మారింది. మరో వైపు విజయసాయి ఢిల్లీ లో అపాయింట్మెంట్లు కూడా సరిగ్గా ఇప్పించలేక పోయారని అందుకే జగన్, విజయసాయి రెడ్డి పై కోపంగా ఉన్నట్లు వార్తలోస్తున్నాయి. ఢిల్లీ లో జరిగిన వ్యవహారాలన్నీ రాజసభ సభ్యులు వేమిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి దగ్గరుండి చుసుకున్నారట. వారిద్దరికే జగన్ ఈ భాద్యతలు అప్పచెప్పి విజయసాయిని పక్కన పెట్టటం పై , కేవలం అపాయింట్ మెంట్లు ఫిక్స్ చేయక పోవటం వల్లే ఇంత దూరం పెడుతున్నారా లేదా ఇంకేమైనా కారణం ఉందా అనేది సొంత పార్టీ నేతలలోనే చర్చ నడుస్తుంది.
అయితే మరో వైపు AP లో ఉత్తరాంధ్ర వ్యవహారాలను కూడా సజ్జలకే అప్పచెప్పారు. ఉద్యోగ సంఘాలతో మీటింగు లైనా, ప్రెస్ మీట్ లైనా అన్నీ సజ్జలే ముందు ఉంటున్నారు. ఇది వరకు అన్నిట్లో ముందు ఉండే విజయసాయి నెమ్మదిగా సైడ్ అయిపోతున్నారు. ఇటు రాష్ట్రం లోను , అటు కేంద్రంలోను విజయసాయిరెడ్డికి ప్రాముఖ్యత జగన్ రెడ్డి పూర్తిగా తగ్గించేసారు. దానికి సరైన కారణం పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే వీరిద్దరి మధ్య ఈ దూరం ఇంకా దేనికి దారి తీస్తుందో చూడాలి. ఈ మధ్య కాలంలో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, భవిష్యత్తులో తాను ఉన్నా లేకున్నా అనే మాటలు మాట్లాడటం అందరినీ షాక్ కు గురి చేసింది. క్రికెట్ పోటీలు, తాను ఉన్నా, లేకపోయినా జరుగుతాయని ప్రకటించారు. త్వరలోనే విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వం కూడా ముగియబోతుంది. అయితే ఈ సారి విజయసాయి రెడ్డికి రాజ్యసభ సభ్యత్వం మళ్ళీ ఇచ్చేది లేదని వైసీపీలో గట్టిగా టాక్ నడుస్తుంది. అసలు ఇద్దరి మధ్య ఎందుకు ఇంత గ్యాప్ వచ్చిందో మరి.