పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో, నిన్నటి నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. ఈ సభలకు విశాఖ శారదా పీఠం స్వరూపానంద స్వామి కూడా హాజరు అయ్యారు. స్వరూపానంద జగన్ కు అత్యంత సన్నిహితులు అనే విషయం తెలిసిందే. జగన్ గెలుపు కోసం యాగాలు చేసానని, బహిరంగంగా చెప్పి, జగన్ ను ముద్దు కూడా పెట్టుకున్నారు. అయితే ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రసంగిస్తూ, స్వరూపానంద చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు వైసీపీకి షాక్ కలిగిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో తిరగలేని పరిస్థితితులు ఉన్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలతో, ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఇలా ప్లేట్ ఎందుకు మార్చారో ఎవరికీ అర్ధం కాలేదు. రాష్ట్రంలో తిరగలేని పరిస్థితి ఉందని, అందుకే తాను మూడు ఏళ్ళుగా హిమాలయాల్లో ఉంటున్నా అని అన్నారు. అయితే ఆయన ఏ పరిస్థితిలో ఈ వ్యాఖ్యలు చేసారో ఎవరికీ అర్ధం కాలేదు. ఈ సభకు హాజరు అయిన వారు మాత్రం, రాష్ట్రంలో శాంతి భద్రతల గురించే, ఆయన ఇలా వ్యాఖ్యలు చేసి ఉంటారాని, భావిస్తున్నారు. స్వరూపానంద స్వామి మాట్లాడుతూ తాను ఎక్కడో రిషికేశ్, హిమాలయాల్లో తిరిగినా, ఇక్కడ ఏపిలో తిరగలేక పోతున్నా అని చెప్పటం, ఏపిలో రోడ్డుల పరిస్థితి పై అయి ఉంటుందని, ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ పరిస్థితి ఉంది కాబట్టి, ఆయన వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు.
అలాగే ఇంగ్లీష్ మీడియా పైన కూడా స్వరూపానంద వ్యాఖ్యలు చేయటం, మరో సంచలనం. యాసతో, తెలుగు భాషను చంపేస్తున్నారని ఆయన అన్నారు. ఇంగ్లీష్ మీడియం మీద ఉన్న మోజుతో తెలుగు భాషను లెక్క చేయటం లేదని అన్నారు. తల్లిదండ్రులు తెలుగు భాషను నేర్పటం లేదని, అలాగే స్కూల్ లో మాత్రం ఇంగ్లీష్ మీడియా కావాలని ఆయన అన్నారు. తెలుగు భాషకు మించిన భాష మరొకటి లేదని అన్నారు. తెలుగు భాష జోలికి రావద్దు అని అన్నారు. సినీ పరిశ్రమ వర్గాలు కూడా, తెలుగు భాషకు ప్రాముఖ్యత ఇవ్వాలని, తెలుగు భాషను చం-పొ-ద్దు అని అన్నారు. తెలుగు భాషను తోక్కేద్దాం అంటే, ఉవ్వెత్తున ఎగురుతుందని అన్నారు. తెలుగు భాష యాస మారొచ్చు కానీ, భాష మాత్రం ఒకటే అని, తెలుగు తీయనైన భాష అని అన్నారు. అయతే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెద్దలు కానీ, వైసీపీ నేతలు కానీ, తెలుగు భాష గురించి ఎవరైనా మాట్లడితే, ఇంగ్లీష్ మీడియం కు వ్యతిరేకంగా మాట్లాడితే, వారి పైన ఎదురు దా-డి చేస్తూ ఉంటారు. మరి స్వరూపానంద పై ఏమి చేస్తారో చూడాలి.