ఏడాది క్రితం ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సంఘటన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే కాదు, దేశాన్ని కూడా ఆశ్చర్య పరిచింది. ఏకంగా ఎస్సీల పైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టటమే కాకుండా, వారిని అరెస్ట్ చేయటం, అలాగే కింద కోర్టుల్లో ఇంత ఘోరం జరుగుతున్నా వారికి బెయిల్ ఇవ్వకపోవటం, అప్పట్లో ఒక పెద్ద సంచలనం అయ్యింది. చివరకు హైకోర్టు జోక్యంతో, వారికి బెయిల్ మంజూరు అయ్యింది. అయితే తరువాత కేసు హైకోర్టుకు వెళ్ళటంతో, హైకోర్టు ఈ అంశం పై ఆశ్చర్య పోయింది. ఎస్సీల పైనే ఎలా ఎస్సీ ఎస్టీ కేసు పెడతారని, కింద కోర్టు మేజిస్త్రేజ్ ఎలా బెయిల్ ఇవ్వకుండా నిరాకరిస్తారని చెప్తూ, ఈ కేసుని హైకోర్టు ఓపెన్ చేసి, గత ఏడాది కాలంగా విచారణ చేసింది. ఎట్టకేలకు ఈ రోజు ఈ కేసు పై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో గుంటూరు అర్బన్ నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ దుర్గా ప్రసాద్, అలాగే రిమాండ్ ని అంగీకరించిన మంగళగిరి మేజిస్ట్రేట్ లక్ష్మీ, బెయిల్ మంజూరు చేయని, గుంటూరు అదనపు జిల్లా జడ్జి వాసంతి పై  క్రమశిక్షణా చర్యలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు ఇస్తూ, సంచలానికి తెర లేపింది.  కృష్ణాయపాలెంలో దళిత రైతులను అరెస్ట్ చేసిన విషయంలో, సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పాటించలేదని కోర్ట్ తేల్చింది. మొత్తానికి మరోసారి ప్రభుత్వ పెద్దలను నమ్ముకుంటే, ఏమి అవుతుందో, ఇప్పటికైనా అధికారులకు తెలిసి వచ్చింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read