పశ్చిమగోదావరి జిల్లా, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ఈ రోజు పోలీసులు హౌస్ అరెస్ట్ లో ఉంచారు. చింతమనేని ఈ రోజు చలో అమరావతికి పిలుపు ఇచ్చిన నేపధ్యంలోనే, ముందస్తు చర్యగా ఆయన్ను హౌస్ అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. చలో అమరావతి కోసం, దెందులూరు నుంచి దాదాపు 200 కార్లలో అమరావతి బయల్దేరేందుకు సిద్ధమైన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు, చింతమనేని ఇంటికి చేరుకున్నారు. అక్కడ నుంచి అమరావతి వచ్చి, అమరావతిలో నిరసనలు చేస్తున్న రైతులకు, మద్దతు ఇవ్వాలని, చింతమనేని భావించారు. అయితే అనుకున్న దాని కంటే, ఎక్కవు మంది ఈ కార్యక్రమంలో పాల్గునటానికి వచ్చారు. అయితే, వారిని అడ్డుకున్న పొలీసులు, చింతమనేనిని హౌస్ అరెస్ట్ చేయడంతో తెలుగుదేశం శ్రేణులు ఆందోళనకు దిగాయి. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే ఇది కొనసాగుతూ ఉండగానే, పోలీసుల కళ్లు గప్పి చింతమనేని అమరావతికి పయనమయ్యారు. చలో అమరావతి నిర్వహించి తీరుతాం అని అన్నారు.

chintamaneni 030320201 2

ఇక మరో పక్క, మూడు రాజధానుల ప్రకట నను ఉపసంహరించుకుని, అమరావతినే రాష్ట్రానికి ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళనలు, నిరసనలు సోమవారం నాటికి 78వ రోజుకు చేరగా ఇప్పటికే పలు రూపాల్లో, వినూత్న రీతిలో నిరసనలు తెలియజేస్తూ వచ్చిన రైతులు ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతం 29 గ్రామాల్లో నిరసనలు కొనసా గాయి. సోమవారం తుళ్లూరు, మందడం, వెలగ పూడి, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, బేతపూడి, కుర గల్లు, పెదపరిమి, ఉండవల్లి, తాడికొండ అడ్డరోడ్డు, తదితర ప్రాంతాల్లో రైతులు, మహిళలు రిలే దీక్షలు, మహాధర్నాలను కొనసాగించారు. రాయపూడి గ్రామంలో మహిళలు ఒంటికాలిపై నిలబడి, మోకా క్లపై కూర్చుని నిరసన తెలిపారు. ప్రభుత్వ మొండి వైఖరిని విడనాడి రాజధానిగా అమరావతినే కొనసా గించాలని డిమాండ్ చేశారు. మందడం గ్రామంలోని చర్చిలో మూడు రోజుల పాటు ప్రత్యేక ప్రార్ధనలు, ఉపవాస దినాలు ఆచరించారు.

chintamaneni 030320201 3

జగన్మోహనరెడ్డి మనసును మార్చి అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని ప్రార్ధనలు నిర్వహిం చారు. ప్రకాశం, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల నుండి వచ్చిన రైతులు రాజధాని గ్రామాల్లో నిర్వహి స్తున్న దీక్షా శిబిరాలను సందర్శించి మద్దతు తెలి పారు. ఈ సందర్భంగా రాజధాని రైతులు, మహి శలు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములు ఇచ్చిన తమపై ఈ విధంగా కక్షపూరి తంగా వ్యవహరించడం తగదన్నారు. రాజధాని గ్రామాల్లో అన్ని వర్గాల వారు ఉన్నారని, ఓ సామాజిక వర్గం ముద్ర వేసి విమర్శలు చేయడం మంచి పద్దతి కాదని హితవుపలికారు. ఎస్సీ నియోజకవర్గమైన తాడికొండ పరిధిలోని మండల, గ్రామాల ప్రజలం దరూ ఓట్లు వేస్తేనే వైసీపీ విజయం సాధించిందని ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు. నాడు అసెంబ్లీలో రాజధానిపై చర్చ జరిగిన సమయంలో 30 వేల ఎకరాలు కావాలని అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చెప్పలేదా అని వారు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ప్రకటించిన మూడు రాజధానుల నిర్ణయంతో మా జీవితాలు వీధిన పడ్డా యని ఆవేదన వ్యక్తంచేశారు. న్యాయం చేయాలని కోరితే అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారన్నారు. కాగా గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిర్వహిస్తున్న రిలే దీక్షల్లో టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ, పలువురు వామపక్ష నేతలు పాల్గొని అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read