నిన్న రాజ్యసభలో రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు లేవనెత్తిన అంశంతో, వైసీపీ రాజ్యసభ సభ్యుడు వెంకయ్య నాయుడు పరువు పోయింది. నిన్న రాజ్యసభలో, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశాల వివరాలు, వాటి పని తీరు గురించి వెంకయ్య నాయుడు చెప్తూ, ఎవరు ఎలా పని చేసింది వివరాలు ఇచ్చారు. దీంట్లో, వైసీపీ నేత, ఎంపి విజయసాయిరెడ్డి నేతృత్వంలోని కామర్స్ కమిటీ పని తీరు అధ్వానంగా ఉందని, తాను ఈ విషయంలో బాధ పడుతున్నట్టు వెంకయ్య చెప్పారు. విజయసాయిరెడ్డి నేతృత్వంలోని కామర్స్ కమిటీ, అన్ని కమిటీల కంటే తక్కువగా కేవలం, 32 శాతం హాజరు మాత్రమే ఉందని, వెంకయ్య నాయుడు సభ దృష్టికి తెచ్చారు. ఇది చాలా విచారకరమని, తాను ఈ విషయంలో అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. ఈ అపవాదుకు, ఆ కమిటీకి నేతృత్వం వహిస్తున్న, విజయసాయిరెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుంది. స్టాండింగ్ కమిటీలు అనేవి, తమకు కేటాయించిన శాఖలు, బాధ్యతల పై సమీక్షలు జరిపి, చర్చలు జరిపి, ప్రభుత్వాలకు సలహాలు ఇస్తాయి.
మరింత మెరుగ్గా ఎలా పని చెయ్యాలి, ఏమి చేస్తే మంచిది, ఇలా వివరంగా ప్రభుత్వానికి తగు సూచనలు ఇస్తారు. అయితే, విజయసాయిరెడ్డి నేతృత్వంలోని కీలకమైన కామర్స్ కమిటీ మాత్రం, ఈ విషయాలను పెద్దగా సీరియస్ గా తీసుకున్నట్టు లేదు. సహజంగా నేతృత్వం వచించే వాళ్ళు బాధ్యత తీసుకుంటే, మిగతా సభ్యులు కూడా, నేతృత్వం వచించే వారిని చూసి నేర్చుకుంటారు. వారు కూడా, సమావేశాల్లో పాల్గునాలి అనే ఆసక్తి వస్తుంది. కాని, ఇక్కడ విజయసాయి రెడ్డి ఆ కమిటీ చైర్మెన్ గా తన బాధ్యతలు సరిగ్గా నిర్వహించటం లేదని, కేవలం 32 శాతం మాత్రమే హాజరు ఉండటం పై, అభ్యంతరం వ్యక్తం అవుతుంది. ఇది రాష్ట్ర సమస్యో, రాజకీయ సమస్యో కాదు, దేశానికి సంబంధించిన విషయం.
మొన్న బడ్జెట్ సమావేశాలు సమయంలో కూడా, బడ్జెట్ పై మాట్లాడండి అని, చైర్మెన్ పిలిస్తే, విజయసాయి రెడ్డి అందుబాటులో లేరు. అపట్లోనే విజయసాయి రెడ్డి పై విమర్శలు వచ్చాయి. కీలకమైన బడ్జెట్ పై, రాష్ట్ర సమస్యలు ప్రస్తావించకుండా జారుకున్నారు అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేసాయి. విజయసాయి రెడ్డికి, ఎంత సేపు ఇక్కడ ఆంధ్రాలో చంద్రబాబుని ఎలా దెబ్బ కొడదాం, ఈ రోజు ఎవరిని ఇరికిద్దాం అనే ధ్యాసే కాని, తనకు ఇచ్చిన బాధ్యతలు చెయ్యటం చేతకాదని, తెలుగుదేశం పార్టీ విమర్సిస్తుంది. ఆయనకు ఢిల్లీలో ఎంపీగా చెయ్యాల్సిన పని కంటే, ఎపిలో రాజకీయాలు చెయ్యటమే ముఖ్యం అని, లేకపోతె ట్విట్టర్ లో పిచ్చి రాతలు రాయటమే ఇష్టం అని, టిడిపి ఆరోపిస్తుంది.