ఫిబ్రవరి 27వ తేదీన, తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యంత్రి చంద్రబాబు నాయుడుని, వైసీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఆ రోజున జబ్బలు చరుస్తూ, చంద్రబాబుని అడ్డుకున్నాం అంటూ, పెద్ద హీరోల్లా ఫీల్ అయ్యారు. ఒక్కొక్కరూ రెచ్చిపోయారు. అయితే, వైసీపీ చేసిన అత్యుత్సాహమే వీరి కొంప ముంచటమే కాక, ఏకంగా డీజీపీని కోర్ట్ కు రావల్సిందిగా హైకోర్ట్ ఆదేశించింది. ఆ రోజు చంద్రబాబుని అడ్డుకోవటం, రాళ్ళు, గుడ్లు వేసి వీరంగం సృష్టించటం, చంద్రబాబుని కదలనివ్వకుండా 5 గంటలు ఉంచటం, ఇవన్నీ వైసీపీకి ఇప్పుడు మైనస్ అయ్యాయి. విశాఖ ప్రజలు, ఇదా వైసీపీ నైజం అని లైవ్ డెమో చూసారు. అయితే, ఇప్పుడు అంతకు మించిన కష్టం వీరికి వచ్చింది. చంద్రబాబుని అడ్డుకున్న కేసు, ఇప్పుడు హైకోర్ట్ లో ఉంది. ఈ సందర్భంగా కోర్ట్, ఒకింత ఆగ్రహంగా ఉంది. చంద్రబాబుకి పర్మిషన్ ఇచ్చి, ఎందుకు ఆయనకు 151 ఇచ్చారు అంటూ, కోర్ట్ వివరణ అడగటం, పోలీసులు ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందకుండా, ఏకంగా డీజీపీనే కోర్ట్ కు రావాలి అని చెప్పటం తెలిసిందే.

అయితే, ఇలా డీజీపీ కోర్ట్ మెట్లు ఎక్కాల్సి రావటం వెనుక, వైసీపీ చేసిన చిన్న తప్పు ఉంది. కార్పొరేటర్ టికెట్లు ఆశిస్తున్నారు వారు, రెచ్చిపోయి జనసమీకరణ చేసి, అధిష్టానం దృష్టిలో పడాలని, రెచ్చిపోయారు. చంద్రబాబుని అడ్డుకుంటమే కాకుండా, ఆ ఫోటోలు, వీడియోలు తీసి, సోషల్ మీడియాలో గొప్పగా, ఏదో ఘనకార్యం చేసినట్టు పెట్టుకున్నారు. అయితే, ఇవన్నీ జగన్ చూస్తారని, తమకు మంచి జరుగుతుంది అనుకున్నారు కాని, ఇప్పుడు ఇవన్నీ కోర్ట్ చూసే పరిస్థితి వచ్చింది. ఆ రోజు దాడి చేసింది అంతా విశాఖ ప్రజలు అంటూ, వైసీపీ నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే దీనికి విరుగుడుగా, తెలుగుదేశం పార్టీ, దాడిలో పాల్గుంది, మొత్తం వైసీపీ నేతలు, కార్యకర్తలు అంటూ, దాదాపుగా 50 మంది ఫోటోలు, వీడియోలు బయట పెట్టారు.

ఇవి కోర్ట్ కు కూడా పంపించే పనిలో ఉన్నారు. ఇక పోలీసులకు కూడా వారి మీద ఆక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి కల్పించారు. దీంతో, కొంత మంది వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసారు. మిగతా వారిని కూడా కోర్ట్ అరెస్ట్ చెయ్యమని ఎక్కడ ఆదేశాలు ఇస్తుందా అని ఇప్పుడు వైసీపీ నేతలు, కార్యకర్తలు భయపడుతున్నారు. ఇక మరొకటి చంద్రబాబు పట్టుబట్టి, నాకు నోటీసు ఇస్తేనే నేను ఇక్కడ నుంచి కదులుతా అని చెప్పటం. వైసీపీ వారిని తరిమి కొట్టకుండా, పోలీసులు చంద్రబాబుని అరెస్ట్ చేస్తాం అని వచ్చిన టైంలో, చంద్రబాబు మాత్రం నాకు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో రాసి ఇవ్వండి, అప్పుడే వస్తాను అంటూ గొడవ చేసిన విషయం తెలిసిందే. దీంతో, చేసేది ఏమి లేక, ఆ రోజు ఒక చిత్తూ కాగితం మీద, నోటీస్ రాసి ఇచ్చారు. ఇప్పుడు అదే టిడిపికి కోర్ట్ లో ఆయుధం అయ్యింది. ఆ నోటీస్ పైనే టిడిపి కోర్ట్ కు వెళ్ళటం, 151 నోటీస్ ఎందుకు ఇచ్చారు అంటూ, డీజీపీని కోర్ట్ కు రమ్మంది హైకోర్ట్.

Advertisements

Advertisements

Latest Articles

Most Read