విజయనగరం జిల్లా మాన్సస్ ట్రస్టు వ్యవహారంలో అనూహ్య పరిణామం నెలకొంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ట్రస్టుకు ఛైర్మన్‌గా కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను తప్పించింది. ఊహించని విధంగా రాష్ట్ర ప్రభత్వం, ఆయన స్థానంలో బీజేపీ ఢిల్లీ అధికార ప్రతినిధిగా ఉన్న సంచిత గజపతి రాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా కూడా ఉన్నారు. అయితే ఈ పదవి, బీజేపీ నాయకురాలికి ఇవ్వటం పై, విస్మయం వ్యక్తం అవుతుంది. బీజేపీ ఏది అడిగితే అది జగన్ చెయ్యాల్సిన పరిస్థితి వచిందనే అభిప్రాయం జరుగుతుంది. మొన్న అంబానీ అడిగిన వ్యక్తికి రాజ్యసభ ఇవ్వాల్సిన పరిస్థితి, ఈ రోజు బీజేపీ ఢిల్లీ నాయకురాలికి పదివి ఇవ్వటం చూస్తుంటే, అదే అనిపిస్తుంది. ఇక మరో పక్క, మాన్సస్ ట్రస్టు ఛైర్మన్‌గా కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గత కొన్నేళ్ళుగా ఆయన వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన్ను పదవిలో నుంచి తొలగించారు.

bjp 04032020 2

మాహరాజ అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్ (మాన్సస్) ట్రస్టును, 1958లో పూసపాటి వంశీయులైన దివంగత పీవీజీ రాజు స్థాపించారు. విద్యను ప్రోత్సహించేందుకు, విద్యా సంస్థల నిర్వహణ కొనసాగించడానికి ఈ ట్రస్టు అండగా నిలుస్తోంది. ఇప్పటికీ ఆయన కుటుంబ సభ్యులే ఈ ట్రస్టు బాధ్యతలు చూసుకుంటున్నారు. 108 ఆలయాలు, 14 వేల 800 ఎకరాల విలువైన భూములను మాన్సస్ ట్రస్ట్ కలిగి ఉంది. విద్యా సంస్థలకు నిరంతర మద్దతు కోసం ఆర్థిక సహాయాన్ని అందించడానికి ప్రత్యేక ఎంవోయూ కుదుర్చుకున్నారు. ట్రస్ట్ డీడ్ వారసత్వంగా ఎల్డెస్ట్ మేల్ లీనియల్ వారసుడు బాధ్యతలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నిబంధన ప్రకారంగా నాడు పీవీజీ రాజు ట్రస్ట్ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన మరణానంతరం 1994లో ఆయన పెద్ద కుమారుడు పూసపాటి ఆనంద్ గజపతి రాజు ఛైర్మన్ బాధ్యతలు చేపట్టారు. 2016లో ఆనంద్ గజపతి రాజు మరణం తరువాత పీవీజీ రాజు రెండో కుమారుడు అశోక్ గజపతి రాజు ఆ పదవి చేపట్టారు. నేటి వరకు ఆయనే ఛైర్మన్‌గా అశోక్ రెండో కుమార్తె అదితి గజపతిరాజు సభ్యురాలుగా ఉన్నారు.

bjp 04032020 3

తాజాగా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును ప్రభుత్వం తొలగించి ఆయన స్థానంలో ఆనంద గజపతి రాజు కుమార్తె సంచితా గజపతి రాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆమె అధికారిక లాంఛనాలతో ట్రస్టు ఛైర్ పర్సన్​గా బాధ్యతలు స్వీకరించారు. ఈ అన్యూహ పరిణామం మాన్సస్ ట్రస్టు సభ్యులు, ఉద్యోగుల్లోనే కాకుండా తెదేపా శ్రేణులను ఉలిక్కిపడేలా చేసింది. ఆనంద గజపతి, అశోక్ గజపతి ఇద్దరూ స్వయానా సొదరులే అయినప్పటికీ ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలుండేవి. అశోక్ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. ఆనంద్ కాంగ్రెస్, తెదేపాలో పనిచేశారు. ఆనంద గజపతి రెండో వివాహం చేసుకున్నారు. ఈయన రెండో భార్య.. రెండో కుమార్తే సంచిత గజపతి. ప్రస్తుతం ఈమె దిల్లీలోనే ఉంటూ అక్కడ భాజపా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. గత ఎన్నికల సమయంలో సంచిత గజపతి విశాఖలో భాజపా కోసం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read