ఒక పక్క ప్రపంచం, దేశం, పక్క రాష్ట్రాలు కరోనా పై అప్రమత్తం అయ్యి, లాక్ అవుట్ చేసి, యుద్ధం చేస్తున్నాయి. మరి మన ప్రభుత్వం ? సరిగ్గా వారం కిందటి దాకా, ఎన్నికల కమీషనర్ కులం పై గోల గోల చేసారు. ఆదివారం నుంచి, గురువారం, శుక్రవారం దాకా, సుప్రీం కోర్ట్ తీర్పు వచ్చే దాకా, ఎన్నికల కమీషనర్ కులం కులం అంటూ, గోల గోల చేసారు. దాదాపుగా, 70 పైన ప్రెస్ మీట్లు పెట్టారు. చివరకు, కోర్ట్ కొట్టేయటంతో, అప్పుడు కరోనా మీదకు డైవర్ట్ అయ్యారు. అప్పటి దాకా, జగన్ కు ప్రయారటీ ఎన్నికలు, ఈసీ కులం. దేశం మొత్తం కరోనా మీద ఉంటే, మనం అక్కడే ఆగిపోయాం. అయితే, గత రెండు రోజులుగా, పక్క రాష్ట్రాలు, కేంద్రం లాక్ డౌన్ ప్రకటించటంతో, ఇక తప్పక మనం కూడా అదే చెయ్యాల్సి వచ్చింది. జగనే ఈ ముక్క నిన్న ప్రెస్ మీట్ లో చెప్పారు. సరే, ఇప్పటికైనా, కరోనా మీద ఏపి ప్రభుత్వం సీరియస్ అయ్యింది, అని అనుకున్న టైంలో, మరొక్కసారి రాజకీయాలు మొదలు పెట్టరు జగన్. కరోనా వస్తే, సరైన హెల్త్ ఫెసిలిటీస్ లేవు.

సరైన హాస్పిటల్స్, బెడ్స్, వెంటిలేటర్స్, టెస్టింగ్ సెంటర్స్, ఇలా ఏమి లేవు. అయినా వీటి మీద మన ప్రభుత్వానికి దృష్టి లేదు. ఎంత సేపు చంద్రబాబు చంద్రబాబు చంద్రబాబు. ఇప్పుడు ఆ చంద్రబాబు మీద కక్ష తీర్చుకోవటానికి, మరో నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇప్పటికే అమరావతిలో ఏదో జరిగిపోయింది అంటూ, మంత్రుల కమిటీ, సిట్, సిఐడి వేసిన జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు సిబిఐ ఎంక్వయిరీ వేస్తూ, జీవో ఇచ్చారు. అమరావతి రాజధాని పరిధిలో భూముల అవకతవకలు జరిగాయని, సీబీఐ దర్యాప్తునకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతంలో కొందరు భూములను కొనుగోలు చేసిన వ్యవహారంపై మంత్రి వర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికలోని అంశాల మేరకు సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

ఈ కేసులో సీఐడీ.. ఐపీసీ సెక్షన్లు 420, 506ల కింద కేసు నమోదు చేసినట్టు ప్రభుత్వం తెలియచేసింది. ప్రస్తుతం వీటన్నిటిపైనా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినట్టు రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే సబ్ కమిటీ ఏమి అయ్యింది, సిట్ ఏమైందో, సిఐడి ఏమైందో ఆ దేవుడికే తెలియాలి. ఇప్పుడు సిబిఐ అంటున్నారు. సరే, సిబిఐ ఎంక్వయిరీ జరిగితే, చంద్రబాబుకి ఎలాగూ క్లీన్ చిట్ వస్తుంది, అది రాజకీయంగా ఆయనకే ఉపయోగ పడుతుంది. కాని, ఇక్కడ విషయం, ఇప్పుడున్న పరిస్థితిలో అంత హడావిడిగా సిబిఐ విచారణకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది ? తన బాబాయ్ కేసు సిబిఐ విచారణకు ఇచ్చారు కాబట్టి, ఇది కూడా ఇవ్వటానికి తప్ప, కోరనా పై శ్రద్ధ పెట్టి, ఆ గోల అయిన తరువాత, ఈ రాజకీయాలు చేసుకోవచ్చు కదా అని ప్రజల నుంచి వినిపిస్తున్న వాదన. సరే, చూద్దాం సబ్ కమిటీ, సిఐడి, సిట్, పట్టుకోలేనిది, సిబిఐ పట్టుకుంటుంది ఏమో.

Advertisements

Advertisements

Latest Articles

Most Read