ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు ముక్కల రాజధాని అంటూ, జగన్ మోహన్ రెడ్డి ప్రకటించి, నేటికి 90 రోజులు పైగా దాటింది. అప్పటి నుంచి రాష్ట్రం అంతటా ఇదేమి నిర్ణయం అంటూ ప్రజలు తల పట్టుకున్నారు. హైకోర్ట్ ఒక చోట, సచివాలయం ఒక చోట, అసెంబ్లీ ఒక చోట ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎక్కడైనా రాజధాని మధ్యలో ఉంటుందని, ఇప్పుడు చిత్తూరు వాళ్ళు, విశాఖ వెళ్ళాలి అంటే, 2 రోజులు పడుతుందని, అలాగే విశాఖ వాళ్ళు కర్నూల్ కోర్ట్ కు వెళ్ళాలి అంటే, ఒక రోజు దాటుతుందని, లేని సమస్యలు సృష్టించి, ప్రజలను ఇబ్బంది పెట్టటం ఎందుకు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక అధికారులు, మంత్రులు, విశాఖకు, అమరావతికి, కర్నూల్ కు తిరుగుతూ ఉంటే, రాష్ట్ర ఖజానా పై అనవసర భారం అనే వాదన కూడా ఉంది. సౌత్ ఆఫ్రికా ను ఆదర్శంగా తీసుకుని, ఇలా చెయ్యటం ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. ఇది ఒక ఎత్తు అయితే, ఇప్పటికే రాజధాని కోసం, అప్పటి ప్రభుత్వాన్ని నమ్మి, రాష్ట్రం కోసం, 34 వేల ఎకరాలు ఇచ్చిన రైతులది ఒక ఎత్తు.
తమకు జీవానోపాధి అయిన పోలలాను రాష్ట్ర రాజధాని కోసం త్యాగం చేసారు. తమకు మంచి జరగటంతో పాటుగా, రాష్ట్రానికి కూడా మంచి జరుగుతుందని భావించారు. రాష్ట్రానికి మంచి రాజధానితో పాటుగా, తమ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని ఆశించారు. అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి కూడా, దీనికి ఒప్పుకున్నారు. దీంతో, మొన్నటి ఎన్నికల్లో అమరావతి ప్రాంత ప్రజలు కూడా, జగన్ ని గెలిపించారు. అమరావతికి డోకా లేదు అనుకున్నారు. అయితే, అనూహ్యంగా జగన్ అమరావతిని మూడు ముక్కలు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ దెబ్బతో, అమరావతి నిర్వీర్యం అయిపోయే ప్రమాదం ఉంది. అందుకే రైతులు, తమ జీవితాలు నాశనం అవుతున్నయాని భావించి, ఆందోళన బాట పెట్టారు.
అయితే ఇదే విషయం పై, అనేక సందర్భాల్లో ప్రతిపక్షాలు కాని, రైతులు కాని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్ళే ప్రయత్నం చేసాయి. అయితే, ప్రధాని మోడీ కాని, అమిత్ షా కాని ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే మొదటి సారి, ప్రధాని మోడి, మూడు రాజధానుల విషయం పై స్పందించారు. తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, ప్రధాని మోడీకి, ఫిబ్రవరి 14న, జగన్ రాజధానిని మూడు ముక్కలు చేస్తున్నారని, ఆ నిర్ణయం వల్ల కలిగే ఇబ్బందులు, రైతులు చేసిన త్యాగాలు, వారు చేస్తున్న ఆందోళన ప్రధానికి వివరించారు. ఈ లేఖ పై ప్రధాని స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్ రాజధానిని, మూడు ముక్కలు చేస్తూ తీసుకున్న నిర్ణయం పై, మీరు రాసిన లేఖ నాకు అందింది, అంటూ, ఈ లేఖ పై పరిశీలిస్తాం అనే విధంగా, ప్రధాని మోడీ స్పందించారు. కనీసం అమరావతిలో రైతులు పడుతున్న ఇబ్బందులు, ప్రధాని దృష్టికి వెళ్ళాయి అనే విషయం అయినా ఇప్పుడు అర్ధమింది. ప్రధాని మోడీ, తొందరలోనే ఈ విషయం పై ఒక నిర్ణయం ఏమైనా తీసుకుంటారా అనే విషయం చూడాలి.