రాష్ట్ర మంత్రివర్గంలో ఇప్పటి వరిస్థితులను బట్టి రెండు మంత్రి పదవులు ఖాళీ కానున్నాయి. ప్రస్తుతం మంత్రి వర్గంలో కీలక బాధ్యతలో వున్న మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు రాజ్యసభకు వెళ్లుతున్నారు. దాంతో వారు ఈ నెల 26వ తేదీ తమ మంత్రి వదవులకు రాజీనామా చేసే అవకాశాలున్నాయి. ఈ ఖాళీ అయ్యే స్థానంలో పదవులు ఎవరికి దక్కుతాయనే అంశంపై రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. రాజీనామా చేసే మంత్రులో పిల్లి సుభాష్ చంద్రబోస్ కీలకమైన రెవెన్యూశాఖా మంత్రిగా వ్యవహరించారు. పైగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికుడా. ఇక మోపీదేవి వెంకటరమణ మార్కెటింగ్ శాఖా మంత్రిగా వ్యవహరించినా, ఆ బాధ్యతలను వ్యవసాయశాఖా మంత్రి కురసాల కన్నబాబుకు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో విషయం మంత్రులుగా రాజీనామా చేయబోయే ఇద్దరు బిసి వర్గానికి చెందిన వారే కావడం, ముఖ్యమంత్రి జగన్ తిరిగి వారి స్థానాలను భర్తీ చేసే సందర్భంలో బిసి సామాజిక వర్గీయులతోనే వాటిని భర్తీ చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది.
పిల్లి సుభాష్, మోపీదేవిలు ప్రాతినిధ్య వహించే ఆయా జిల్లాలకు చెందిన వారికే మంత్రులుగా అవకాశం రావొచ్చననే కథనం ప్రచారంలో ఉంది. దీంతో ఆయా జిల్లాల్లో ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో అదే జిల్లాకు ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కు అవకాశం వస్తుందని భావిస్తున్నారు. గుంటూరు జిల్లా నుంచి మోపిదేవి వెంకటరమణ కారణంగా ఖాళీ కాబోయే స్థానానికి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనీకి అవకాశం ఉంటుందన్నారు. ఆమెకు ఇది మంచి చాన్స్ అయ్యే అవకాశంగా మారుతుందంటున్నారు. ఆమె పిల్లి సుభాష్ కు దక్కిని ఉపముఖ్యమంత్రి చాన్స్ లభించవచ్చునంటున్నారు.
ఎన్నికలకు కొన్నాళ్ళకు ముందు ఆమె తెలుగుదేశం నుంచి వైఎస్సాఆర్ కాంగ్రెస్ లోకి వచ్చారు. అక్కడి జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అనుచరురాలిగా వ్యవహరించిన రజనీ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. వైఎస్సాఆర్ కాంగ్రెస్ లోకి వచ్చిన తరువాత ఆమె చిలకలూరిపేట నుంచి పోటీ చేసి గెలుపొందారు. సామాజికవర్గ పరంగా చిలకలూరిపేట ప్రాంతంలో ఉన్నారు రజనీ. ఈమెను ఉప ముఖ్యమంత్రి చేస్తారనే వాదన విన్పిస్తుంది. అయితే ప్రాంతీయ దామాషాలో ఆ అవకాశం దక్కకపోవచ్చుననే వాదన ఉంది. రజనికి కాకుండా ప్రస్తుతం మంత్రివర్గంలోనే ఉన్న మరొకరికి ఈ అవకాశం దక్కే అవకాశం ఉంటుందంటున్నారు. ఉప ముఖ్యమంత్రి హోదా కాకున్నా మంత్రి వర్గంలో విడుదల రజనీ స్థానం దక్కే వీలు ఉందని అధికారపార్టీవర్గాలు భావిస్తున్నాయి. అయితే జగన్ కచ్చితంగా వీరికే మంత్రులుగా అవకాశం ఇస్తారని చెప్పలేమనే వాదన ప్రచారంలో ఉందంటున్నారు. ఈ నెలాఖరు జరిగే అసెంబ్లీ సమావేశాల నాటికి ఈ చర్చ ముగిసే అవకాశం ఉంది.