స్థానిక ఎన్నికల వాయిదా నిర్ణయంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తీరును సీఎం జగన్‌ తప్పుబట్టిన వేళ.. ఆ పార్టీ నాయకులు కూడా విమర్శల వర్షం కురిపించారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఎన్నికల వాయిదా పై మాట్లాడుతూ, వెధవలకు పదవులు, గాడిదలకు కొమ్ములొచ్చినా ప్రమాదమేనని స్పీకర్ దారుణ వ్యాఖ్యలు చేశారు. రమేష్ కుమార్‌ను సీఎం కుర్చీలో కూర్చోమనండి..?. ఏం తమాషా చేస్తున్నారా?. రాజ్యాంగ బద్ద పదవుల్లో ఉన్న వ్యక్తులు కుల,మతాలకు అతీతంగా ఉండాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర అధికారులతో సంప్రదించకుండా వాయిదా నిర్ణయం ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. రమేశ్ కుమార్ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. రమేశ్ కుమార్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని విమర్శించారు. మునిగిపోతున్న తెదేపా నావను కాపాడేందుకే ఎన్నికలు వాయిదా వేశారని ఆరోపించారు. కనకపు సింహాసనం పై, శునకాన్ని కూర్చోపెట్టినట్టు, రమేష్ కుమార్ ని కూర్చో పెట్టారు అంటూ, ఏకంగా ఈసీని కుక్కతో పోల్చారు.

రమేశ్ కుమార్ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్టు తెలిపారు. రమేష్ కుమార్​ను చంద్రబాబు హయాంలో ఎన్నికల కమిషనర్ పదవిలో నియమించారని.. ఆ రుణం తీర్చుకోవడానికే ఎన్నికలు వాయిదా వేశారని మంత్రి కన్నబాబు విమర్శించారు. రమేశ్ కుమార్ నిర్ణయాన్ని రాజకీయ కుట్రగా మరో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అభివర్ణించారు.వికేంద్రీకరణ బిల్లును మండలిలో ఛైర్మన్ ద్వారా ఎలా అడ్డుకున్నారో.. ఎన్నికల సంఘాన్ని కూడా అదే రీతిలో చంద్రబాబు కనుసన్నల్లో నడిపించారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. కనీసం రాష్ట్ర అధికారాలతో సంప్రదింపులు జరపకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు కరోనా వైరస్​ వల్ల వాయిదా పడలేదని.. క్యాస్ట్​ వైరస్​ వల్ల వాయిదా పడ్డాయని వైకాపా నేత అంబటి రాంబాబు ఆరోపించారు.

ఎన్నికలు వాయిదా నిర్ణయాన్ని తప్పుబట్టిన ఆయన.. తెదేపాకు అనుకూలంగా ఎన్నికల కమిషనర్​ ప్రక్రియ నిలిపేశారని విమర్శించారు. చంద్రబాబు రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. స్థానిక ఎన్నికలు వాయిదా వేస్తూ ఎన్నికల కమిషనర్​ తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని వైకాపా నేత డొక్కా మాణిక్య వరప్రసాద్​ అన్నారు. పేదలకు మంచి చేకూర్చే ఇళ్ల పంపిణీని కోడ్​ సాకుతో నిలిపేశారని.. ఇది మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్​ కరోనా వైరస్​ కారణంగా స్థానిక ఎన్నికలు వాయిదా వేయడాన్ని రాష్ట్ర మంత్రి అనిల్​కుమార్​ యాదవ్​ తీవ్రంగా తప్పుపట్టారు. ఒక వ్యక్తి కోసమో, తన సామాజిక వర్గానికి చెందిన పార్టీ బాగుండాలనో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వాయిదా నిర్ణయం తీసుకోవడం బాధాకరమని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. త్రి ఫోన్​ కాల్​ వస్తే ఉదయం సమావేశం పెట్టి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారని విమర్శించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read