రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయాదా వేస్తూ తీసుకున్న నిర్ణయంపై ఎన్నికల నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖకు సమాధానం ఇస్తూ, కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఆమె రాసిన లేఖపై ఆయన స్పందిస్తూ మూడు పేజీల లెటరులో ఎన్నికలను ఎందుకు వాయిదా వేయవలసి వచ్చిందో వివరించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితిని నమీక్షించి, అవసరమను కుంటే ఆరువారాలకన్నా ముందుగానే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖలోను, రాజ్ భవన్లో పైనాన్స్ వ్యవహరాల నిర్వహణలో పనిచేసిన అనుభవం తన కుందన్నారు. గతంలో ఎన్ని కలు నిలిపివేసినా కేంద్రం నిధులు వచ్చిన సందర్భాలున్నాయన్నారు. కరోనా వైరస్ ప్రభావంతో ఇప్ప టికే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేసారన్నారు. గోవాలోను స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదావేసే విష యాన్ని చర్చిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గ్రాంట్లు, నిధుల విడుదల విషయంలో అవగాహన ఉందన్నారు. 14వ ఆర్థిక సంఘం నిధుల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం సహకారం ఉంటుందన్నారు.

నిర్ణయం తీసుకునే ముందు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శితో సంప్రదింపులు జరిపానన్నారు. వారి సూచనలు,హమీతో ఎన్ని కలు వాయిదా వేసామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎన్నికలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నానన్నారు. అందరి కంటే ముందు నిర్ణయం తీసుకోవడం వల్లే విమర్శలు వచ్చాయన్నారు. కరోనా వైరస్ వివిధ దశల్లో వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిందన్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా ప్రబలుతోంది. వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడితే ఆరువారాల కంటే ముందే ఎన్నికల నిర్వహించేందుకు సిద్ధమన్నారు. ఎన్నికల నిర్వాహణకు సంబంధించి ఆరువారాల తరువాత వరిస్థితులను సమీక్షి స్తామన్నారు. ఎన్నికలకు, ఆర్థిక సంఘం నిధులకు ముడిపెట్టవద్దని సూచించారు. జరిగిన పరిస్థితులపై అపార్థాలకు తావులేకుండా ఉండేందుకే సీఎస్ కు లేఖ రాసినట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదివారం వాయిదా వేసారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసారు.కరోనా వైరసే సాకుతో ఎన్నికలువాయిదా వేయడాన్ని ఆయన తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహరంలో ఎంతవరకైనా వెళుతుందని ఆయన వెల్లడించారు. ఈ విషయంపై ఆయన గవర్నర్‌ను కలుసుకుని ఎన్నికల కమీషనర్ పై ఫిర్యాదు చేసారు. ఈ పరిణామాల నడుమ రాష్ట్ర ప్రభుత్వ సిఎస్ నీలం సాహ్ని ఎన్నికల అధికారి రమేష్ కుమార్‌కు లేఖ రాసారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి లేదని, నియంత్ర ణకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆ లేఖలో వివరించారు. ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని ఎన్నికల సంఘం ఉవసంహరించుకోవాలని విజృప్తి చేసారు. ముందుగా ప్రకటించిన తేది ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. నీలం సాహ్ని రాసిన లేఖకు ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ రాసిన లేఖలో జాతీయ వివత్తుగా కరోనాను కేంద్రం ప్రకటించినందున ఆ దిశలోనే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని వాయిదా వేసినట్టు స్పష్టం చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read