కరోనా వైరస్ ప్రభావం ప్రపంచంలోనే కాదు, మన దేశంలో కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది. అయితే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, అన్ని విద్యాసంస్థలు ముసేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే మన రాష్ట్రంలో మాత్రం, మన ప్రభుత్వం కరోనా గురించి పెద్దగా పట్టించుకోలేదు. జగన్ ప్రెస్ మీట్ పెట్టి, కరోనా పెద్ద రోగం కాదని, ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్ అంటూ, సింపుల్ గా చెప్పేసారు. పారాసిటమాల్ వేసుకుంటే చాలు అని చెప్పారు. అలాగె బ్లీచింగ్ కొట్టుకుంటే చాలు అని చెప్పారు. అయితే ఇదంతా ఎన్నికల కోసం పడుతున్న పాట్లు. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేస్తున్నాం ని చెప్పటంతో, కరోనాని తక్కువ చేసి చూపించాలి అనే చెప్పే ప్రయత్నం చేసారు. దీంతో, గత రెండు మూడు రోజులుగా, అన్ని రాష్ట్రాలు, జాగ్రత్తలు తీసుకుంటుంటే, మనం మాత్రం, కరోనా పెద్దగా లేదు అని చెప్పే ప్రయత్నం చేసారు. దీంతో అసలు ఇక్కడ ఏమి జాగ్రత్తలు తీసుకోకుండా ఉండే పరిస్థితి అయిపొయింది. అయితే, ఇప్పుడు ఈ రోజు సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చింది.
కరోనా ఉన్న సమయంలో ఎన్నికలు వెళ్లకపోవటం మంచిదే అంటూ, ఎన్నికల కమీషనర్ నిర్ణయాన్ని సమర్ధించింది. దీంతో, ఇక కరోనా పై జాగ్రత్తలు తీసుకోక పొతే, అసలుకే మోసం వస్తుందని, ఇప్పటికి మన ప్రభుత్వం కదిలింది. కరోనా భయపెడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మహమ్మారిని కట్టడిచేసేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా విద్యా సంస్థలను మూసివేయాలని నిర్ణయించింది. రేపట్నుంచి రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. పాఠశాలలు, కళాశాలలు, వర్సిటీలు, కోచింగ్ సంస్థలకు సెలవులు ఇవ్వాలని ఆదేశించింది. విద్యాశాఖ, వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు మరో 276 మంది భారతీయులు కరోనా బారిన పడ్డట్లు వెల్లడించింది విదేశాంగ శాఖ. ఒక్క ఇరాన్‌లోనే దాదాపు 255 మంది భారతీయులకు ఈ మహమ్మారు సోకినట్లు తాజాగా ధ్రువీకరించింది. వీరితో పాటు యూఏఈలో 12 మంది, ఇటలీలో అయిదుగురు, శ్రీలంక, రువాండా, కువైట్, హాంగ్‌కాంగ్‌లో ఒక్కో భారతీయుడు కరోనా బారిన పడ్డట్లు విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ ప్రకటించారు. చైనాకు లక్ష సాధారణ మాస్కులు, మరో లక్ష వైద్య చికిత్స మాస్కులు, 4000 ఎన్-95 మాస్కులతో పాటు ఐదు లక్షల జతల చేతి తొడుగులను ఎగుమతి చేసినట్లు మురళీధరన్ తెలిపారు. భారత వైమానిక దళానికి చెందిన సీ-17 ప్రత్యేక విమానం ద్వారా వీటన్నింటినీ వుహాన్‌కు చేర్చినట్లు స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య స్నేహానికి గుర్తుగానే వీటిని చైనాకు అందించామన్నారు మురళీధరన్.