స్థానిక ఎన్నికల వాయిదా పై ఇటు ప్రభుత్వానికి, అటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య మొదలైన యుద్ధాని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తెర దించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆరువారాల పాటు స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయు పై రాష్ట్ర ప్రభుత్వం ముప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను ఈ రోజు విచారించిన చీఫ్ జస్టిస్, జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన ధర్మాసనం ఒకవైపు ఈసీ నిర్ణయాన్ని సమర్థిస్తూనే, మరోవైపు ఎన్నికల నియమావళిని ఎత్తివేయాలని ఆదేశించింది. ఎన్నికల నిర్వహణ ఎప్పుడు నిర్వహించాలనే అంశం కూడా ఈనీ పరిధిలోకే వస్తుందని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా కొత్త ప్రాజెక్టులు చేపట్టాలంటే మాత్రం ఈసీ అనుమతి తీసుకొనవలసిందేనని పేర్కొంది. ఎన్నికలను వాయిదా వేస్తే కోడ్ ను తొలగించాలన్న ప్రభుత్వ వాదనను మాత్రమే సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ కేసులో తదువరి ఆదేశాలు వచ్చే వరకు ఎన్నికల నియమావళిని ఎత్తివేయాలని సుప్రీం పేర్కొంది. అయితే ఇదేదో తమ విజయం అన్నట్టు, వైసీపీ హర్షం వ్యక్తం చేస్తుంది. ఎన్నికల కోడను ఎత్తివేయడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాల కార్యక్రమాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోవడం శుభపరిణామమని అధికా రపక్షనేతలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఎన్నికల కోడ్ ఉన్నా, ఎక్కడా సంక్షేమ పధకాలు ఆగావు. కొత్త పధకాలు మాత్రమే చెయ్యటం కుదరదు. ఇప్పుడు కూడా సుప్రీం అదే చెప్పింది. అదీ కాక సుప్రీం కోర్ట్ చెప్పింది, అభివృద్ధి కార్యక్రమాలు అని, ఎక్కడా కొత్త సంక్షేమ పధకాలు అని చెప్పలేదు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా, పాత పధకాలు అయినా పెన్షన్లు, రైతు బంధు లాంటి పధకాలు ఆగిన చరిత్ర ఎప్పుడూ లేదు.
ఇందులో వైసీపీ ఎందుకు హంగామా చేస్తుందో ఎవరికీ అర్ధం కావటం లేదు. జగన్ ప్రభుత్వం సుప్రీంకు వెళ్ళింది, ఎన్నికల వాయిదా వద్దు, ఇప్పుడే ఎన్నికలు జరపాలి అని. ఆ విషయం పక్కన పెట్టి, ఎన్నికల కోడ్ ఎత్తేసింది, ఈసీ కోర్ట్ తిట్టింది అంటూ, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇదే విషయం పై చంద్రబాబు కూడా స్పందించారు. "ఎన్నికలపై ఎందుకు సుప్రీంకు వెళ్లారో రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాలి. దీనికి సమాధానం చెప్పాలి. సుప్రీంకు వెళ్లి ఏం సాధించారు..? ఈసిని ఇష్టానుసారం దూషిస్తారు. ఈ రోజు కూడా ఒక వైసిపి ఎమ్మెల్యే ఈసిని పట్టుకుని వెధవ అంటాడు. కేంద్రం నుంచి రూ5వేల కోట్లు రావని పదేపదే అంటారు. అబద్దాలు చెప్పడానికి సిగ్గుపడాలి. ఈ రోజుకూడా సుప్రీంకోర్టును వక్రీకరిస్తారు. ఈ తీర్పులో సుప్రీంకోర్టు ఈసిని తప్పు పట్టిందని ఎక్కడ ఉంది..? సుప్రీంకోర్టు తీర్పును కూడా వక్రీకరించడానికి వీళ్లకు బుద్ది జ్ఞానం ఉందా.? ఇంత ఉన్మాదమా..? చేసిన తప్పును కప్పిపెట్టుకోడానికి మళ్లీ ఎదురు దా-డి చేస్తారా..? " అంటూ చంద్రబాబు స్పందించారు.