చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు చంద్రబాబు ఫోన్ చేసారు. పుంగనూరు నియోజకవర్గంలో పరిస్థితుల పై ఫిర్యాదు చేసారు. నామినేషన్లు వేయకుండా అభ్యర్ధులను మంత్రి పెద్దిరెడ్డి అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వవద్దని పెద్దిరెడ్డి ఆదేశాలపై చంద్రబాచంద్రబా ధ్వజమెత్తారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని చంద్రబాబు అన్నారు. ఎస్పీ చొరవ తీసుకుని అభ్యర్ధులకు భద్రత కల్పించాలని అన్నారు. ఎన్నికల నేరగాళ్లను నియంత్రించాలని,పెద్దిరెడ్డి అనుచరుల దౌర్జన్యాలను అడ్డుకోవాలని అన్నారు. అన్నిచోట్ల నామినేషన్లు పడేలా అధికారులే శ్రద్దచూపాలని, అభ్యర్ధులు అందరికీ సర్టిఫికెట్లు అందేలా చూడాలని, సర్టిఫికెట్లు అందక పోటీచేయలేని దుస్థితి ఉండరాదని అన్నారు. అది ప్రజాస్వామ్యానికే తీరని కళంకం అని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సింది ప్రభుత్వ యంత్రాంగమే అని, రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించాలని, వైసిపి ఫ్యూడల్ పోకడలకు అడ్డుకట్ట వేయాలని చంద్రబాబు చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలను కోరారు.

ఇక అంతకు ముందు, పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి అరాచకాలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. టిడిపి నాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పులిచర్ల, సదూం మండలాల్లో నామినేషన్లు వేయకుండా పెద్దిరెడ్డి బెదిరించడంపై నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. కుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వవద్దని అధికారులను మంత్రి బెదిరించడంపై చంద్రబాబు మండిపడ్డారు. ఫ్యూడలిస్ట్ పోకడలకు కాలం చెల్లిందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. స్థానిక సంస్థల స్ఫూర్తినే సీఎం జగన్ కాలరాస్తున్నారని, పంచాయితీ రాజ్ చట్టాలను, ఎలక్షన్ మాన్యువల్ ను, కోడ్ ఆఫ్ కాండక్ట్ ను అపహాస్యం చేస్తున్నారని, అధికారం ఉందని విర్రవీగితే ప్రజలే బుద్ది చెబుతారని ధ్వజమెత్తారు.సర్టిఫికెట్లు సకాలంలో ఇవ్వకుండా గ్రామాల్లో ఉద్రిక్తతలు రెచ్చగొడితే, ఏర్పడే దుష్పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.

అభ్యర్ధులకు కావాల్సిన సర్టిఫికెట్లు ఇప్పించే బాధ్యత ఎన్నికల సంఘానిదే అన్నారు. సర్టిఫికెట్లు అందక అభ్యర్ధులు పోటీచేయలేని దుస్థితి ఉండకూడదని అన్నారు. అధికారులు నలుగురికి కావాల్సిన వాళ్లంటూ, పార్టీలతో సంబంధం లేకుండా నిష్పక్షపాతంగా పని చేయాలని అన్నారు. వైసిపి పట్ల వివక్షత చూపించి, విద్యుక్త ధర్మ నిర్వహణకు ద్రోహం చేయకూడదని అన్నారు. పోటీబడి గెలవాలే తప్ప ఇలాంటి దుష్టపన్నాగాలు పిరికిచేష్టలుగా ధ్వజమెత్తారు. ఓడిపోతామనే భయంతోనే ఈ విధమైన దుర్మార్గాలకు వైసిపి బరి తెగించిందని మండిపడ్డారు. పోటీకి అడ్డంకులు కల్పించడం ద్వారా ఏకగ్రీవం చేయాలనే వైసిపి నేతల కుట్రలను ప్రజలే భగ్నం చేయాలని అన్నారు. ప్రతిచోటా నామినేషన్లు పడేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల యంత్రాంగంపైనే ఉందని అన్నారు. మరో రెండురోజుల్లో తానే క్షేత్రస్థాయి పర్యటనకు వస్తానంటూ, ప్రజాక్షేత్రంలో వైసిపి ఫ్యూడల్ చర్యలను ఎండగడతామని హెచ్చరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read