రాష్ట్రంలో శాంతిభద్రతల విషయమై ప్రతిపక్షం ఆరోపణలు చేస్తున్న వేళ, రాష్ట్ర ప్రభుత్వానికి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. హైకోర్ట్ లో ఇప్పటికే, రెండు సందర్భాల్లో, ఏకంగా డీజీపీ నే వచ్చి మాకు సమాధానం చెప్పాలి అంటూ కోర్ట్ చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కేంద్రం కూడా, రియాక్ట్ అయ్యింది. నెల రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వైసీపీ చేసిన రౌ-డీ చర్యల పై నివేదిక సమర్పించాలి అంటూ, ఏపీ హోంశాఖ కార్యదర్శికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. తమకు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలి అంటూ, కేంద్రం కోరింది. కాకినాడ ఘటనలో రెచ్చిపోయిన రౌడీల పై చర్యలు తీసుకోవాలని, యు.వెంకటరమణ కేంద్ర హోం శాఖకు లేఖ రాసారు. ఈ లేఖ పై స్పందించిన కేంద్రం, ఈ విషయంలో మేమే డైరెక్ట్ గా వచ్చి విచారణ చెయ్యలేం అని, పోలీసు, శాంతిభద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశాలని, అందుకే ఈ విషయం పై రాష్ట్ర హోం శాఖ విచారణ చెయ్యాలంటూ ఆదేశాలు ఇచ్చింది. జరిగిన విషయం పరిశీలించి సరైన చర్యలు తీసుకోని, ఏమి చేసారు అనేది తమకు నివేదిక పంపాలని ప్రథమ కార్యదర్శి అశోక్‌కుమార్ రాష్ట్రానికి చెప్పారు.
‘‘మాజీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లను కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి బహిరంగంగా, అసభ్య పదజాలంతో దూషించారు. పవన్ అభిమానులు క్షమాపణలు కోరడానికి చంద్రశేఖర్‌రెడ్డి ఇంటికి వెళ్లగా వారిని రౌ-డీ-లు కొ-ట్ట-డం-తో పాటు రా-ళ్లు విసురుతూ తరిమేశారు. కాకినాడలో జరిగిన రౌ-డీ-ల ఆగడాలపై తూర్పుగోదావరి ఎస్పీ నుంచి నివేదిక తెప్పించుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి’’ అంటూ, కేంద్ర హోంశాఖకు యు.వెంకటరమణ లేఖ రాసారు. ఇక మరో ఘటనలో, గుంటూరు అర్బన్ ఎస్పీ రామకృష్ణపై సీబీఐ విచారణ ప్రారంభమైంది. హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులు విచారణ ప్రారంభించారు. క్రికెట్ బెట్టింగ్ వివాదంలో కొందరిని అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధించారని గుంటూరు అర్బన్ ఎస్పీ రామకృష్ణపై అభియోగం ఉంది.
వ్యవహారంలో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో దిల్లీ నుంచి సీబీఐ అధికారులు ఇవాళ గుంటూరుకు వచ్చారు. చేబ్రోలు పోలీసులతోపాటు సీసీఎస్ పోలీసుల నుంచి కేసు వివరాలు సేకరించారు. అలాగే ఎస్పీ రామకృష్ణను కూడా రహస్యంగా విచారించారు. అక్రమం నిర్బంధం వ్యవహారంపై ఆరా తీశారు. దీనిపై హైకోర్టు ప్రాథమిక విచారణకు ఆదేశించగా నిర్బంధం నిజమేనని తేలింది. మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలన్న పిటిషనర్ల విజ్ఞప్తి మేరకు హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ వ్యవహారంలో నిందితులను నిర్బంధించింది సీపీఎస్ పోలీసులే అయినా... ఎస్పీ ఆదేశాల మేరకే ఇలా చేశారని పిటిషనర్లు ఆరోపించారు. ఐపీఎస్ అధికారి కావటంతో ఈ వ్యవహారాన్ని సీబీఐ విచారించాలంటూ రెండు వారాల క్రితం ఆదేశాలు జారీచేసింది.