మాజీ మంత్రి వైఎస్‌ వి-వే-కా-నం-ద-రెడ్డి హ-త్య కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఈ రోజు కీలక ఆదేశాలు జారీ చేసింది. సాధ్యమైనంత త్వరగా కేసు విచారణ పూర్తి చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాల్లో పేర్కొంది. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వి-వే-కా-నం-ద-రె-డ్డి హ-త్య జరగడం అప్పట్లో సంచలనం కలిగించింది. కేసు దర్యాప్తు అనేక మలువులు తిరుగుతున్న సమయంలో వి-వే-కా తనయ సునీత హైకోర్టును ఆశ్రయించారు. తన తండ్రి హ-త్య కే-సు-లో తనకు అనుమానాలు ఉన్నాయని పేర్కొంటూ కొందరి పేర్లను హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్లో పేర్కొన్నారు. తన తండ్రి హ-త్య కే-సును సిబిఐకి అప్పగించి దర్యాప్తు చేయాలని ఆమె కోరారు. గతంలోనే వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, అప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకుడు బిటెక్ రవి, బిజెపి నాయకుడు ఆదినారాయణరెడ్డిలు వేర్వేరుగా పిటీ షన్లు దాఖలు చేసిన విషయం విదితమే. అయితే కొద్ది రోజుల క్రితం జగన్ మాత్రం, సిబిఐ విచారణ అవసరం లేదని పిటీషన్ వెనక్కు తీసుకున్నారు.

viveka 110320520 1

ప్రస్తుతం తాజాగా ఆయన కుమార్తె సునీత ఈ కేసు దర్యాప్తుపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ సిబిఐకి అప్పగిస్తే తన కుటుంబానికి తగిన న్యాయం జరుగుతుందని ఆమె వివరించారు. వేర్వేరుగా దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి ఒకేసారి విచారించేందుకు హైకోర్టు సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనిపై కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కేసును సిబిఐకి అప్పగించడంలో ఉన్న అభ్యంతరాలు ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. వి-వే-కా హ-త్య కే-సు-లో కొందరిపై అనుమానాలు ఉన్నాయంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో సునీత పేర్కొన్నారు. ప్రత్యేకమైన ఆరోపణలేవి చేయడంలే దంటూనే తమకు అనుమానాలు ఉన్నాయంటూ కొందరి పేర్ల జాబితా హైకోర్టుకు ఆమె సమర్పించారు. తొలుత పేర్కొన్న జాబితాలో ఉన్న పేర్లు వాచ్మెన్ రంగయ్య. యర్ర గంగిరెడ్డి, వై.యస్. అవినాష్ రెడ్డి సన్నిహితులు ఉదయ కుమార్ రెడ్డి, వైసిపి రాష్ట్ర కార్యదర్శి శివశంకర్‌ రెడ్డి, పరమేశ్వరరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, వై.యస్. అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, వై.యస్.మనోహర్ రెడ్డి, వై. యస్. అవినాష్ రెడ్డి, సిఐ శంకరయ్య, ఏఎస్ఇ రామకృష్ణారెడ్డి, ఇసి సురేంద్రనాథ్ రెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, మారెడ్డి రవీంద్ర నాథరెడ్డి, ఘటనా స్థలంలో ఉన్నవారి సన్నిహితుల సలహాలు సూచనలు తీసుకున్న తరువాత తమకు కొందరిపై అనుమానాలు ఉన్నాయని పై జాబితాను సునీత కోర్టుకు సమర్పించారు.

viveka 110320520 1

కేసు విచారణ తుది దశలో ఉందని ఈ సమయంలో సిబిఐ విచారణ అవసరం లేదని ఇప్పటికే ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. గతంలో హైకోర్టులో పిటీషన్ వేసిన విషయాన్ని కూడా సునీత మరోసారి గుర్తు చేశారు. గవర్నర్‌ను కలిసి కూడా విజృప్తి చేశామని ఆమె వెల్లడించారు. కేసు దర్యాప్తు సరిగ్గా జరగడం లేదని తమకు న్యాయం చేయాలని కోరారు. ఏపి పోలీసులపై నమ్మకం లేదని అప్పట్లో చెప్పి ఇప్పుడు మరలా అదే పోలీసులతో దర్యాప్తు జరపడం ఎంతవరకు సమంజసం? అని 3 సిట్ టీమ్ లు ఏర్పాటు చేసిన దర్యాప్తు ఓ కొలిక్కిరాలేదని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు కోర్ట్, సిబిఐ విచారణకు ఆదేశాలు ఇస్తూ, నిర్ణయం తీసుకోవటంతో, ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read