జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు, ఏమి చెప్పారో గుర్తుందా ? కేంద్రంలో మోడీకి మన బలం అవసరం లేదు, మన కర్మకు ఆయనకు ఫుల్ మెజారిటీ ఉంది, అందుకే మనం ఏమి కావలి అన్నా, సార్ ప్లీజ్, సార్ ప్లీజ్ అని బ్రతిమిలాడుకోవటమే అంటూ, జగన్ చెప్పిన మాటలు గుర్తుండే ఉంటాయి. అయితే, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డికి, రాజ్యసభ రూపంలో, అదిరిపోయే అవకాసం వచ్చింది. రాజ్యసభలో బీజేపీకి ఎక్కువ మెజారిటీ లేదు అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో బీజేపీ తెగ ఇబ్బంది పడుతుంది. అయితే కొత్తగా 55 రాజ్యసభ సీటులు ఖాళీ అవుతున్నాయి. అందులో మన రాష్ట్రం నుంచి నాలుగు సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఈ నాలుగు కూడా, వైసీపీనే గెలుచుకుంటుంది. అయితే, ఈ నాలుగు మన రాష్ట్రానికి చెందిన వారికి ఇస్తారని ఎవరైనా అనుకుంటారు. కాని ఇక్కడ అనూహ్యంగా, ఎక్కడో జార్ఖండ్ కు చెందిన వ్యక్తికి, మన రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపిస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. దీని వెనుక అనేక స్టొరీలు నడిచాయి.

modi 10032020 2

మనకు కనిపించేది, ఏకంగా ముఖేష్ అంబానీ, తాడేపల్లి వచ్చి, జగన్ ను కలవటం. అయితే వైసీపీ మాత్రం, వేరేలా ప్రచారం చేసింది. ఇంకేముంది, అంబానీ మన రాష్ట్రలో వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు అంటూ ఊదరగొట్టారు. కట్ చేస్తే, అంబానీకి బాగా సన్నిహితుడు అయిన, పరిమల్ నత్వానీకి, ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ టిక్కెట్ ఇచ్చారు జగన్. రేపు నామినేషన్ కూడా వేస్తున్నారు. దీని వెనుక బీజేపీ ఉందని, అమిత్ షా ఇచ్చిన ఆదేశాల ప్రకారమే, జగన్ తూచ తప్పకుండా అవి పాటించారని తెలుస్తుంది. అయితే, పరిమల్ నత్వానీని, ఏపి నుంచి పంపించటం వల్ల, మన రాష్ట్రానికి ఉపయోగం ఏమిటి ? మన రాష్ట్రానికి కేంద్రం ఏమైనా అదనపు సహాయం చేస్తుందా ? లేక పెండింగ్ లో ఉన్న పనులు చేస్తుందా ?

modi 10032020 3

లేదు, కేంద్రం ఇవేమీ చెయ్యటం లేదు. పరిమల్ నత్వానీకి టికెట్ ఇచ్చే ముందు, బీజేపీ ముందు జగన ఒక కొండీషన్ పెట్టారని సమాచారం. అదే, తన నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న శాసనమండలి రద్దు తీర్మానం, ఈ సెషన్ లోనే పార్లమెంట్ లో ఆమోదించాలని, జగన్ అడిగారని, దానికి బీజేపీ పెద్దలు కూడా ఒప్పుకున్నట్టు సమాచారం. అయితే, దీని పై కేంద్రం నిజంగా నిర్ణయం తీసుకుంటుందో లేదో చూడాలి. అయితే ఇది ఇలా ఉంటే, రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన సమస్యలు అయిన ప్రత్యెక హోదా, పోలవరం నిధులు, విభజన హామీలు, అధిక నిధులు ఇలా వీటికి డిమాండ్ పెట్టి, కండీషన్ ఇలా పెట్టాలి కాని, తన రాజకీయ ప్రయోజనాల కోసం, ఇలా రాజ్యసభ సీటు తక్కట్టు పెట్టటం ఏమిటి అంటూ తెలుగుదేశం విమర్శిస్తుంది. స్థానిక సంస్థలు ఎన్నికలు అవ్వగానే, వైసీపీ కేంద్రంలో చేరుతుంది అని సమాచారం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read