ఆంధ్రప్ర దేలో శాసనమండలి రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం సానుకూల రీతిలో నిర్ణయం తీసుకోనున్నది. ఈ అంశంపై రాజ్య సభ ఎన్నికల అనంతరం కేంద్రం సానుకూల సాంకే తాలను ఇస్తుందనే కథనాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వస్తున్నాయి. ఏపీలో శాసనమండలిని రద్దు చేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇందుకు ఏపీ శాసనసభ ఓటింగ్ విధానంలో ఏక గ్రీవంగా ఆమోదించింది. సభకు హజరైన వైసీపీ శాసన సభ్యులంతా శాసనమండలి రద్దుబిల్లుకు సానుకూలరీతిలో ఓటు చేసారు. ఆ వెంటనే బిల్లును రాష్ట్ర గవర్నర్ ఆమోదించడంతో కేంద్రానికి పంపిం చారు. కేంద్రం ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఓకే చేయాల్సి వుంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు బడ్జెట్ సమా వేశాల్లో ఈ బిల్లుకు చర్చకు వస్తుందని భావిస్తు న్నారు. గత నెల్లో ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని, హోంమంత్రి అమిత్ షాను కలిసిన సందర్భంలో డీల్ కుదిరినట్టు చెప్తున్నారు.

ఢిల్లీ వెళ్ళిన సందర్బంలో ఆయన రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ, శాసనమండలి రద్దు బిల్లులపై వారితో చర్చించినట్లు సమాచారం. అయితే జగన్ డిమాండ్ కు, అమిత్ షా రాజ్యసభ డిమాండ్ పెట్టారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో శాసనమండలి రద్దుతో మండలి సభ్యులుగా కొనసాగుతున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపీదేవి వెంకట రమణ పదవులు కొల్పోతారు. వారిద్దరికి మంత్రి పదవులు ఆ తరువాత ఆరునెలలకు మించి ఉండవు. ఈ పరిస్థితుల్లో వారిని రాజ్యసభకు పంపించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. అన్నట్లుగానే రాజ్యసభ నోటిఫికేషన్ జారీ కావడంతో పిల్లి సుభాష్,మోపిదేవిలకు జగన్ రాజ్యసభ టిక్కెట్లు ఇచ్చారు. వారితో పాటుగా ఆళ్ళ ఆయోధ్య రామిరెడ్డి, ముకేష్ అంబాని సన్నిహితుడు పరిమల నత్వానికి సీటును కేటాయించారు. శాసన మండలి రద్దుకు కేంద్రం సానుకూలతను వ్యక్తం చేసినందునే మరి కొంతకాలం పిల్లి సుభాష్, మోపీ దేవిలు మంత్రులుగా కొనసాగే అవకాసం ఉన్నా, రాజ్యసభ టిక్కెట్లు జగన్ ఇచ్చారంటున్నారు.

అంతే కాకుండా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సన్నిహిత సంబంధాలున్నా ముకేష్ అంబానీ ఆప్తమిత్రుడు పరిమళ నత్వానికి సీటు ఇవ్వడం వెనుక శాసనమండలి రద్దుకు కేంద్రం సుముఖతను వ్యక్తం చేసిన నేపథ్యం ఉందంటున్నారు. నిజానికి అమిత్ షా ఆదేశాలకు అనుగుణంగానే ముకేష్ అంబానీ, నత్వాని ముఖ్యమంత్రి జగన్ కార్యాలయానికి నేరుగా వచ్చారంటున్నారు. ప్రాంతీయ అంశాల ద్వారా రాష్ట్రం తీసుకునే నిర్ణయాలు ఏలా వున్నా అనేక కీలక అంశాల్లో వైకాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలుస్తున్నందున ఖచ్చితంగా ఎపి ప్రభుత్వం చేసిన ప్రతిపాదనల్లో కీలకమైన శాసనమండలి రద్దుకు అనుకూలరీతిలో నిర్ణయం తీసుకోవాలని కేంద్రం నిర్ణయించిందంటున్నారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు విషయంలో రాష్ట్ర బిజెపి నేతలతో పాటుగా, ఇతరత్రా కొంత కీలక చర్చ జరిగిన తరువాత మాత్రమే ఎటు స్పందించాలో అనే విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకుం టుందన్నారు. అయితే రాష్ట్రానికి ఎన్నో హామీలు పెండింగ్ లో ఉన్న నేపధ్యంలో, రాజకీయ కారణాలతో, కేంద్రం రాష్ట్రం ఆడుకోవటం మాత్రం, గర్హనీయం...

Advertisements

Advertisements

Latest Articles

Most Read