తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో గురువారం ఎన్టీఆర్ భవన్ లో సిపిఐ నాయకులు రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వర రావు, హరనాథ్ రెడ్డి తదితరులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై వారు చర్చించారు. 
9నెలల్లో రాష్ట్రాన్ని 9ఏళ్లు వెనక్కి నెట్టారని, ఇంత జీవన విధ్వంసం కనీవినీ ఎరుగమని, అన్నివర్గాల సంక్షేమం-రాష్ట్ర అభివృద్దికి తూట్లు పొడవడమే కాకుండా భావితరాల భవిష్యత్తును అంధకారం చేశారని సిపిఐ నేతలు అభిప్రాయబడ్డారు. కూల్చివేతలు-విధ్వంసాలు, రద్దులు-కోతలు, బెదిరింపులు-వేధింపులు,దాడులు-దౌర్జన్యాలు మున్నెన్నడూ లేవని అన్నారు. అమరావతిని చంపేశారని, పోలవరం సహా ప్రాజెక్టుల పనులన్నీ నిలిపేశారని, బిసి,ఎస్సీ,ఎస్టీ,మైనారిటి పేదలను అష్టకష్టాల పాలు చేశారని ఆగ్రహించారు. రాజధానికి రైతులిచ్చిన భూముల్లో పేదలకు పట్టాలు ఇస్తామని చెప్పి రైతులు, పేదల మధ్య విద్వేషాలు పెంచుతున్నారు. బిసి,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ పేదలు సాగుచేసుకునే అసైన్డ్ భూములను లాక్కుంటున్నారు. కార్డులు, పించన్ల తొలగింపు, అన్నా కేంటిన్ల మూసివేత, సంక్షేమ పథకాల్లో కోతలు దారుణమని అన్నారు. 151సీట్లు వచ్చాయన్న అహంభావంతో పేట్రేగిపోతున్నారని, రేపటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ వీళ్లు గెలిస్తే మరింత పేట్రేగిపోతారని అన్నారు.

వైసిపి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు సంఘటితమై వైసిపి అరాచకాలను అడ్డుకోవాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ భేటిలో టిడిపి నాయకులు బచ్చుల అర్జునుడు, టిడి జనార్దన్, వర్ల రామయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో వారు మాట్లాడారు. సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ...బీసీ రిజర్వేషన్లపై సీఎం జగన్ సరైన రీతిలో స్పందించలేదు. గత సీఎం చూపిన చొరవ చూపలేదు. అందరి అభిప్రాయాలు తీసుకోలేదు, సుప్రీం కోర్టుకు వెళ్లలేదు. ఎన్నికల్లో గెలిపించే బాధ్యత మీదే అంటూ మంత్రులకు వార్నింగ్ ఇవ్వటం జగన్ నైజాన్ని తెలియజేస్తోంది. స్ధానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గడం వల్ల బీసీలు 4 జడ్పీ చైర్మన్లలో ఒకటి, 65 జడ్పీటీసీలు, 65 ఎంపీపీలు, వేల సంఖ్యలో ఇతర స్ధానిక సంస్ధల పదవులను బీసీలు కోల్పోనున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో జగన్ నిర్లక్యంగా వ్యవహరించారు. గతంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై కిరణ్ కుమార్ రెడ్డి అఖిలపక్ష సమావేశం నిర్వహించి సుప్రిం కోర్టుకు వెళ్లారు.

కానీ ఇప్పడు జగన్ అఖిలపక్షం ఎందుకు ఏర్పాటు చేయలేదు? అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకు రూ. 5 కోట్లు పెట్టి లాయర్ ని నియవించిన జగన్ బీసీ రిజర్వేషన్లపై ఆ విధంగా ఎందుకు వ్యవహరించలేదు? రిజర్వేషన్లపై ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్తోంది. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపణి చేస్తే 3 ఏళ్ల జైలు శిక్ష అని జగన్ చెప్పటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. వైసీపీ ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి గెలవలేదా? డబ్బు పంచటాన్ని మేం ప్రోత్సహించటం లేదు, కానీ కేవలం ఈ నెపంతో ప్రత్యర్ధి పార్టీల అభ్యర్డులను భయబ్రాంతులకు గురి చేసి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వైసీపీ గెలిచేందుకు ప్రయత్నం చేస్తోంది. దీనిపై ప్రజల్లో చర్చ జరగాలని రామకృష్ణ కోరారు. చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన వారిలో సీపీఐ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, హరినాధరెడ్డి, టీడీపీ నేతలు బచ్చుల అర్జునుడు తదితరులు ఉన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read