రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ రమేశ్‌ కుమార్​ నుంచి కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ వచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. లేఖపై ఏపీ సీఎస్‌తో కేంద్ర హోంశాఖ కార్యదర్శి మాట్లాడారని తెలిపారు. ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్ రాసినట్లుగానే లేఖ వచ్చిందని.. అధికారులపై బెదిరింపులకు పాల్పడటం సరికాదని కిషన్‌రెడ్డి అన్నారు. ఏపీ సీఎస్‌తో మాట్లాడి ఆయనకు రక్షణ ఇవ్వాలని చెప్పామన్నారు. వీలైతే ఇవాళ రాష్ట్రానికి లిఖితపూర్వక ఆదేశాలు ఇస్తామని వెల్లడించారు. అధికారులను బెదిరిస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదని.. రమేశ్‌కుమార్ ప్రస్తుతం హైదరాబాద్‌లో రక్షణలోనే ఉన్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. ఏపీకి వచ్చేటప్పుడు పూర్తి రక్షణ తీసుకోవాలని సీఎస్‌కు చెప్పినట్లు పేర్కొన్నారు. అధికారులని బెదిరించటం సరి కాదని కిషన్ రెడ్డి అన్నారు. ఎప్పటికప్పుడు, రాష్ట్ర అధికారులతో మాట్లడతున్నాం అని, అన్ని వివరాలు తెలుసుకుంటున్నాం అని అన్నారు. ఆయన భద్రత రాస్త్రానిదే అయినా, కేంద్రాన్ని కోరటంతో, సరైన బద్రత ఇస్తాం అని అన్నారు.

కిషన్ రెడ్డి ఏమన్నారంటే... "లేఖ వచ్చింది. మేము, మా హోం సెక్రటరీకి వచ్చింది, ఆయన రాసింది. మా హోం సెక్రటరీ అక్కడ ఉన్న చీఫ్ సెక్రటరీతో మాట్లాడారు. ఎప్పటికప్పుడు, ఆ వివరాలు మేము కూడా తెలుసుకుంటున్నాం. ఆయన ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు. సెక్యూరిటీ ఉంది ఇప్పుడు. ఎప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ కు వెళ్ళినా కూడా, పూర్తీ స్థాయి సెక్యూరిటీ ఇవ్వాలని, చీఫ్ సెక్రటరీకి ప్రభుత్వం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాము. అవసరం అయితే మేము లిఖిత పూర్వకంగా కూడా, చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇస్తాము. ఇది పూర్తిగా స్టేట్ గవర్నమెంట్ కు సంబంధించిన ఇంటర్నల్ ఇష్యూ. అయినా, ఏ ప్రభుత్వ అధికారిని అయినా, భయపెట్టటం కాని, అది మంచి పధ్ధతి కాదు, అని స్పష్టంగా చెప్తున్నాం. మాకు తెలిసినంత వరకు, ఆయనే ఈ లేఖ రాసారు. నేను మా హోం సెక్రటరీతో మాట్లాడాను, ఆయన ఏపి చీఫ్ సెక్రటరీతో మాట్లాడారు. యాన రాసిన లేఖే ఇది. ఇప్పటి వరకు అయితే, రమేష్ కుమార్ గారు బయటకు చెప్పలేదు." అని కిషన్ రెడ్డి అన్నారు.

ఇక ఎన్నికల కమీషనర్ రాసిన ఈ లేఖ పై, రెండు రోజులుగా వైసీపీ గోల గోల చేస్తుంది. లేఖలో ఉన్న దాని గురించి మాట్లాడ కుండా, లేఖలో ఉన్న కంటెంట్ నిజమా కాదా అని చెప్పకుండా, లేఖ ఫేక్ అంటూ, ప్రచారం మొదలు పెట్టారు. దీంతో అసలు లేఖలో ఏముంది అనే విషయం పక్కదారి పట్టింది. ఇది ఒకరంగా వైసీపీ వేసిన ప్లాన్ అనే చెప్పాలి. ఇలా లెటర్ ఫేక్ ఫేక్ అంటూ ప్రచారం చెయ్యటంతో, వార్తా సంస్థలు కాని, లేక ఇతరులు కాని, ఆ లేఖ పై చర్చ లేకుండా చేసారు. అలాగే వైసీపీ నేతలు ఇంకాస్త ముందుకు వెళ్లి, ఆ లేఖ ఫేక్ అంటూ, డీజీపీ కి కూడా ఫిర్యాదు చేసారు. అయితే నిన్న హోం శాఖ ఇచ్చిన ఆర్టీఐ, ఈ రోజు ఏకంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా , ఈ లేఖ నిజం అని చెప్పటంతో, వైసీపీ ఏమంటుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read