కరోనా వైరస్ నియంత్రణకు దేశ ప్రధాని మోడీ పిలుపుతో యావత్ దేశం మొత్తం ఏప్రిల్ 14వరకు లాక్ డౌన్లోకి వెళ్లి పోయింది. దీంతో లక్షాలాది రూపాయల ఖర్చుతో రైతులు పండించిన పంటలు చేతి కోచ్చే సమయానికి నేలపాలు అవుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం రైతు కూలీలకు అనుమతి ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేటుగా ఆదేశాలు వచ్చాయి. అయినా, బయటకు వచ్చే వారు లేదు. దీంతో పంటలకు తీవ్ర నష్టం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ప్రస్తుత పరిస్థితులల్లో రైతులు పంట పొలాల్లోకి వెళ్లి పరిస్థితి లేదు. ఒకవేళ అన్ని ఇబ్బందులను అధిగ మించి పొలాలకు వెళ్లినా, పండించిన పంటలను ట్రాక్టర్, ఇతర రవాణా వాహనాల ద్వారా మార్కెట్లోకి తీసుకొచ్చి వాటిని విక్రయించే పరిస్థితి లేదు. దీంతో రైతులు పండిన పంటను పొలాల్లోనే ఉంచడం మినహా ఏమీ చేయలేకపోతున్నారు. దీంతో చేతి కొచ్చిన పంట మొత్తం దాదాపు నేలపాలవుతోంది. పంట దిగుడికోసం పెట్టిన లక్షాలాది రూపాయిల పెట్టుబడి మొత్తం వృధా అవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

చివరికి రైతు పండించిన పంట నేలపాలు అవటంగాని, లేక సరైన గిట్టుబాటు - ధరలేక పోవటంతో రైతులు అప్పుల పాలవుతు న్నారు. ముఖ్యంగా పూలు, పండ్లు, కూరగాయలు, మిర్చి, పసుపుతోపాటు సీజన్ పండ్లు అయిన మామిడి, సపోటా, కమలాలు, పుచ్చకాయలతో సహా అనేక రకాల పంటలు పండించే రైతులు నష్టపోతున్నారు. ముఖ్యంగా మామిడి, పుచ్చకాయ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీనికి ముఖ్యకారణం లాక్ డౌన్లో ఎక్కడి రవణా ఆక్కడ స్తంభించిపోవడం. దేశంలోని ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి ఆలాగే రాష్ట్రాల్లో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అత్యవసర సేవలు, నిత్యావసర సరకుల కోసం మాత్రమే ప్రజలు ఇంటి బయటకి వచ్చి నిర్ణీత సమయంలో వాటిని కొనుగోలు చేసుకొని తిరిగి ఇంటికి వెళ్లి పోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

రైతులు పండించిన పంటను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలించేటప్పుడు అనేక సమస్యలను రైతులు ఎదుర్కొంటున్నారు. ప్రజలకు అవసరమైన, నిత్యవసరాలైన కూరగాయలు, పండ్లులను మార్కెట్లోకి రైతులు తీసుకోచ్చెటప్పుడు వారికి ఏవిధమైన ఆటంకాలు కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, అవసరం అయితే ప్రభుత్వమే , ఈ పండ్లు, కూరగాయలు కొని, ప్రజల వద్దకే మొబైల్ రైతు బజార్లు పెట్టి అమ్మాలని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అలాగే మిగతా పంటలకు కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని కోరారు. నిత్యవసరాలైన పూలు, పండ్లు, కూరగాయ లతోపాటు సీజనల్ పండ్లు పండించే రైతులకు కూడా ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే నష్టం జరిగిపోయింది అని, ఇప్పటికైనా మేల్కొని, ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు కోరుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read