తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, విజయనగరంలో జరిగే ప్రజా చైతన్య యాత్రలో భాగంగా, విశాఖలో పేదలకు ఇళ్ల స్థలాల కోసమంటూ పెందుర్తి మండలం పినగాడి పంచాయతీ పరిధిలోని కోట్నివానిపాలెం సమీపంలో 90 ఎకరాల విస్తీర్ణంలో పెంటవాని చెరువు ఆక్రమించుకోవటం, పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో గల వీర్రాజు చెరువుని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ కబ్జా చేస్తున్నారు అంటూ, ఈ రెండు ఘటనల పై, విశాఖలో కూడా పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే చంద్రబాబు ఆ చెరువును చేరుకోనివ్వకుండా, రాత్రికి రాత్రి, చెరువుకి అరకిలోమీటర్ ముందు గొయ్యి తవ్వారు. ఇది ఇలా ఉంటే, ఈ పర్యటన కోసం, తెలుగుదేశం పార్టీ, పోలీస్ పర్మిషన్ కూడా తీసుకుంది. పోలీసులు కూడా షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. అయితే విశాఖలో చంద్రబాబు దిగే సరికి, 500 మందికి పైగా వైసీపీ పోగేసిన అల్లరి మూకలు ఎయిర్ పోర్ట్ లోకి వచ్చాయి. 50 మందికి మించి టిడిపి నాయకులు చంద్రబాబుకు స్వాగతం పలకకూడదు అని చెప్పిన పోలీసులు, ఇంత మందిని ఎలా రానిచ్చారు అనేది తెలుగుదేశం ప్రశ్న.
ఈ వైసీపీ అల్లరి మూకల చేతిల్లో రాళ్ళు, గుడ్లు ఉన్నాయి. వీటిని ఒక అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లోపలకి ఎలా అనుమతి ఇచ్చారు ? ఎయిర్ పోర్ట్ బయట, కేవలం 500 మంది వైసీపీ మూకలు, చంద్రబాబుని 5 గంటలు పాటు కదల నివ్వకుండా ఉంటే, పోలీసులు ఆ అల్లరి మూకలను ఎందుకు క్లియర్ చెయ్యలేదు ? జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత ఉన్న వ్యక్తిని, 5 గంటల పాటు, అల్లరి మూకల మధ్య ఎలా ఉంచారు ? ఇక చివరగా, వైసీపీ అల్లరి మూకలను అరెస్ట్ చెయ్యకుండా, చంద్రబాబుని అరెస్ట్ చెయ్యటం పై, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే, ఈ మొత్తం వ్యవహారం, పై, చంద్రబాబుకు రక్షణగా ఉన్న, కేంద్ర బలగాలు అయిన, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, కేంద్రానికి నివేదిక సమర్పించినట్టు తెలుస్తుంది.
చంద్రబాబుకి రక్షణగా ఉండే, ఎన్‌ఎస్‌జీ కమాండర్, ఈ మొత్తం వ్యవహరం పై, కేంద్ర హోమ శాఖకు ఒక నివేదిక పంపించారు. ఆ నివేదికలో, రాష్ట్ర పోలీసులు పై సంచలన ఆరోపణలు చేసారని తెలుస్తుంది. చంద్రబాబు విశాఖపట్నం పర్యటనలో, పోలీసులు, ఆయనకు కనీస రక్షణ కూడా కల్పించ లేదని, ఎక్కువ మంది నిరసనకారులు దూసుకు వచ్చినా, వారిని ఆపలేదని, రాళ్ళు, గుడ్లు, టమాటాలు, తీసుకు వచ్చి, ఆయన పై వెయ్యటానికి ప్రయత్నం చేసినా, నిర్లిప్తంగా వ్యవహరించారని, పోలీస్ ఉన్నతాధికారుల సమక్షంలోనే ఇదంతా జరిగినట్టు, కేంద్ర హోం శాఖకు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ బృందం నివేదిక పంపించింది. దీనికి సంబంధించిన, వీడియో ఎవిడెన్స్, ఫోటోలు కూడా కేంద్రానికి పంపినట్టు సమాచారం. మరో పక్క ఇప్పటికే కోర్ట్, ఈ విషయం పై సీరియస్ అయిన విషయం తెలిసిందే.