రాష్ట్రంలో కరోనా మమమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఇటీవల రాష్ట్రంలో రోజుకు రెండు కేసుల చొప్పున నమోదవుతుండగా... తాజాగా శనివారం ఒక్కరోజే ఆరు కొత్త పాజిటీవ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 19కు ఎగబాకింది. తాజాగా నమోదైన ఈ ఆరు కేసుల్లో రెండు గుంటూరు జిల్లాకు చెందినవి కాగా.. మరో రెండు ప్రకాశం జిల్లాలో నమోద య్యా యి. వీటితోపాటు ఒక కేసు కృష్ణాజిల్లాలో, మరో కేసు కర్నూలు జిల్లాలోనిర్ధారణ అయ్యాయి. గుంటూరుకు చెందిన రెండు కేసులు కూడా ఇటీవలే కరోనా వ్యాధికి గురైన వ్యక్తితో కాంటాక్టు అయినవారు(కుటుంబసభ్యులు). ప్రకాశం జిల్లాలో తాజాగా నమోదైన రెండు కేసుల్లో మొదటి వ్యక్తి (60 సం.లు) ఈ నెల 18వ తేదీన ఒంగోలు నుంచి రైలులో ఢిల్లీ వెళ్లాడు. అక్కడి నుంచి ఈ నెల 18న జనశతాబ్ది ఎక్స్ ప్రెస్లో విజయవాడ మీదుగా ఒంగోలుకు తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ నెల 28వ తేదీన కరోనా లక్షణాలు కనపడటంతో హాస్పటల్ లో చేరగా..పాజిటీవ్ రిపోర్టు వచ్చింది. అలాగే ఇతనితో కాంటాక్టు అయిన మహిళ కూడా కరోనాకు గురైంది. దీంతో మక్కా నుంచి కృష్ణాజిల్లాకు తిరిగొచ్చిన వ్యక్తికి కరోనా సోకింది. రాజస్థాన్ నుంచి కర్నూలు నుంచి వ్యక్తి కూడా కరోనాగా నిర్ధారణ అయింది.

రాష్ట్రంలో కరోనా అనుమానిత కేసులు పెరుగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి, రాష్ట్రంలోనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేలా చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించి ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) నుంచి అనుమతులు తీసుకుంది. ఈ సందర్భంలో ఐసీఎంఆర్ కూడా ఆంధ్రప్రదేశ్ లో నాలుగు వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ట్ లేబొరేటరీ (వీఆర్డీఎల్) ఏర్పాటుకు అనుమతులు ఇచ్చింది. అంతేకాకుండా ఈ వీఆర్టీఎల్ ఏర్పాటుకు అవసరమైన అన్ని రకాల పరికరాలు, టెస్టింగ్ చేసే సిబ్బందికి శిక్షణను కూడా ఇప్పించింది. దీంతో పూణెలోనే సెంట్రల్ వైరాలజీ కేంద్రానికి శాంపిల్స్ పంపించి, వారిచ్చే నివేదిక కోసం ఎదురుచూసే ఇబ్బందులు తప్పాయి. దీంతో రాష్ట్రంలో సిద్ధార్థ మెడికల్ కళాశాల విజయవాడ, రంగరాయ మెడికల్ కళాశాల కాకినాడ, శ్రీవెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్) తిరుపతి, అనంతపురం మెడికల్ కళాశాలల్లో ఈ వైరస్ రీసెర్చ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ నాలుగు లేబొరేటరీలలో రోజుకు 240 నమూనాలను పరీక్షలు చేయవచ్చు.

అంటే ఒక్కోలేబొరేటరీలో షిప్పుకు 30 నమూనాల చొప్పున రెండు షిఫుల్లో 60 నమూనాలను పట్టించి, చెయ్యవచ్చు. అయితే అందుకు అనుగుణంగా టెస్ట్ లు మాత్రం, జరగటం లేదని, ప్రభుత్వం విడుదల చేస్తున్న బులిటెన్ చూస్తే అర్ధం అవుతుంది. కాగా రాష్ట్రంలో మరో రెండు కరోనా టెస్టింగ్, నిర్ధారణ ల్యాబ్స్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించింది. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల అనుమానితల కోసం విశాఖలో, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల అనుమానితుల కోసం గుంటూరులో ఈ ల్యాబ్ లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 496 నమూనాలను అనుమానితుల నుంచి సేకరించారు. వీటిలో 19 పాజిటీవ్ కేసులు రాగా.. 412 నెగిటీవ్ రిపోర్టు వచ్చాయి. మరో 65 నమూనాలకు సంబంధించి నివేదికలు రావల్సి ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read